LPG Cylinder | ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మధ్య తరగతి ప్రజలకు మరో షాక్ తగిలింది. నిత్యం వంటకు వినియోగించే వంట గ్యాస్ ధరలు భారీగి పెరిగిపోయాయి. ఒకేసారి ఏకంగా ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 60, కమర్షియల్ సిలిండర్‌పై రూ. 115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన వంట గ్యాస్ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
పెరిగిన వంట గ్యాస్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ నగరంలో ఆ ధర రూ. 965కి చేరింది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు తేల్చిచెప్పాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
