విధాత : వన్యప్రాణులు..పాములు జనవాసాల్లోకి చొరబడటం అస్ట్రేలియాలో వంటి దేశాల్లో సాధారణమే అయినప్పటికి..ఓ భారీ పైథాన్(అనకొండ) ఏకంగా బాత్ రూమ్ షవర్ ను తాకెలా నిలబడటం చూస్తే ఎవరికైనా గుండె ఆగినంత షాక్ తప్పదు.
అస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లోకి చల్లని వాతావరణం వెతుక్కుంటూ వచ్చిన 20అడుగులు భారీ కార్పెట్ పైథాన్ ఆ ఇంటివారిని తీవ్రంగా భయపెట్టింది. స్నానం కోసం బాత్ రూమ్ లోకి వెళ్లగా..ఎప్పుడు దూరిందో ఏమోగాని అందులో ఓ పెద్ద కార్పెట్ పైథాన్ షవర్ ఎత్తు వరకు గోడకు పాకి నిలబడి ఉండటం కనిపించింది. ఒక్కసారిగా భారీ పైథాన్ ను చూసి బయటకు పరుగు పెట్టారు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అస్ట్రేలియాలో ఈ నవంబర్ మాసంలో వెచ్చని వాతావరణం నుంచి ఉపశమనం కోసం క్వీన్స్‌ల్యాండ్ ప్రాంతంలో పెద్ద్ సంఖ్యలో పాములు చల్లని, తడిగా ఉన్న ఆవాసం కోసం జనావాసాల్లోకి దూరుతున్నాయి. దేశ వ్యాప్తంగా తమ నివాసాల్లోకి పాములు, పైథాన్లు వచ్చాయంటూ స్నేక్ క్యాచర్ కు 10వేల కంటే ఎక్కువే కాల్స్ రావడం అక్కడ ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని 140కంటే అధిక పాము జాతులలో 100కు పైగా సర్పాలు విషపూరితమైనవిగా గుర్తించారు. అయితే కార్పెట్ పైథాన్‌లకు మాత్రం అక్కడ విషరహితంగా భావించి సంరక్షణ జాతులలో చేర్చారు.
a normal day in Australia (?) pic.twitter.com/NWYzRDRBc8
— Kala (@kalayangmana) November 27, 2025
