Harish Shankar | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ కాదంటూ హరీష్ శంకర్ క్లారిటీ.. రూమర్లపై ఘాటైన సమాధానం

Harish Shankar | పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ గ‌బ్బ‌ర్ సింగ్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. హిందీ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ పవన్ ఇమేజ్‌కి, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో పలు మార్పులు చేసి చిత్రాన్ని రూపొందించారు. ఫలితంగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి పవన్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది.

Harish Shankar | పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్లు ఉన్నప్పటికీ గ‌బ్బ‌ర్ సింగ్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. హిందీ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ పవన్ ఇమేజ్‌కి, తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో పలు మార్పులు చేసి చిత్రాన్ని రూపొందించారు. ఫలితంగా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి పవన్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. ఈ సక్సెస్ తర్వాత పవన్–హరీష్ కాంబోలో మరో సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తుండగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, శ్రీలీల‌, రాశి ఖ‌న్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి.

కొంతకాలంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తమిళ చిత్రం తేరీకి రీమేక్ అన్న ప్రచారం సాగుతోంది. అట్లీ దర్శకత్వంలో విజ‌య్ హీరోగా, స‌మంత, అమీ జాక్స‌న్ హీరోయిన్లుగా తెరకెక్కిన ‘తెరి’ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో విడుదలై మంచి స్పందన అందుకుంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’లో పవన్ పోలీస్ పాత్రలో నటించడం, ఇద్దరు హీరోయిన్లు ఉండటం వంటి అంశాల ఆధారంగా ఇది ‘తెరి’ రీమేక్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మేకర్స్ పలుమార్లు ఖండించినప్పటికీ రూమర్లు మాత్రం ఆగలేదు.

హరీష్ శంకర్ ఘాటైన స్పందన

తాజా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ ఈ రూమర్లపై స్పష్టంగా స్పందించారు. “నాకు ఏదైనా సినిమా నచ్చితే కథ, మాటలు, మార్పులు, దర్శకత్వం అని టైటిల్ కార్డ్‌లో స్పష్టంగా వేస్తాను. ‘గబ్బర్‌సింగ్’ సమయంలో కూడా అలాగే చేశాను. తెలుగులో ఆ తరహా టైటిల్ కార్డ్ పెట్టింది నేనే. నిజంగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రీమేక్ అయితే ఎందుకు కథ, మాటలు, దర్శకత్వం అని వేస్తాను?” అని ప్రశ్నించారు.

అలాగే పోలీస్ కథల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌పై హీరో పోరాడటం సాధారణమేనని, అలాంటి కథలన్నీ ఒకేలా కనిపిస్తాయని చెప్పారు. అంతేకాదు, ‘గబ్బర్‌సింగ్’లోని అంత్యాక్షరి సీన్‌ను ‘తెరి’లో రైమ్స్ ఎపిసోడ్‌గా వాడుకున్నారని పేర్కొంటూ, “నా సినిమాలోని సీన్ తీసుకుని వాళ్లు వాడుకుంటే నేను వాళ్ల సినిమా రీమేక్ చేశానని ఎలా అంటారు?” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

భారీ అంచనాల మధ్య విడుదల

మొత్తానికి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పై ఉన్న రీమేక్ రూమర్లకు హరీష్ శంకర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర, మాస్ ఎలిమెంట్స్, హరీష్ టేకింగ్ అన్నీ కలిసి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 26న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం పవన్–హరీష్ కాంబోకు మరో బ్లాక్‌బస్టర్ అందిస్తుందా అన్నది చూడాలి.

Latest News