Ustaad bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్’కు ఓవర్సీస్‌లో గట్టి షాక్.. బాక్సాఫీస్ వద్ద తగ్గుతున్న కలెక్షన్స్
Ustaad bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. మొదటి వీకెండ్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ తర్వాత సినిమా కలెక్షన్స్‌లో గణనీయంగా పడిపోయింది. సోమవారం నాటికి థియేటర్లలో ప్రేక్షకుల హాజరు 50 శాతం కంటే తక్కువగా ఉండటం నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది.
Ustaad bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. మొదటి వీకెండ్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఆ తర్వాత సినిమా కలెక్షన్స్‌లో గణనీయంగా పడిపోయింది. సోమవారం నాటికి థియేటర్లలో ప్రేక్షకుల హాజరు 50 శాతం కంటే తక్కువగా ఉండటం నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, ఈ సినిమా మొత్తంగా 50 శాతం కంటే ఎక్కువ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ, సినిమా ఆశించిన రీతిలో సక్సెస్ కాలేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి.
ఓవర్సీస్‌లో తీవ్ర నిరాశ
దేశీయంగా మాత్రమే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రదర్శన నిరాశాజనకంగా మారింది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ చాలా తక్కువగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రీమియర్స్ , ఫస్ట్ డే కలిపి ఈ చిత్రం కేవలం సుమారు 5.15 లక్షల డాలర్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ స్థాయి ఓపెనింగ్‌ను చాలా తక్కువగా పరిగణిస్తున్నారు.
దీంతో పోలిస్తే, హరి హర వీర మల్లు సినిమా ప్రీమియర్ రోజునే దాదాపు 8 లక్షల డాలర్లు వసూలు చేసి, మొత్తం నార్త్ అమెరికాలో సుమారు 1.25 మిలియన్ డాలర్లను అందుకుంది.
బ్రేక్ ఈవెన్ దూరంలోనే
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓవర్సీస్ హక్కులను ప్రాత్యంగిర సినిమాస్ సుమారు రూ.12 కోట్ల అడ్వాన్స్‌తో కొనుగోలు చేసింది. ఈ డీల్ ప్రకారం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 3 మిలియన్ డాలర్ల వసూళ్లు రావాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా మొత్తం రన్‌లో గరిష్టంగా 1.2 మిలియన్ డాలర్ల వరకు మాత్రమే వసూలు చేసే అవకాశం ఉందని అంచనా. షేర్ లెక్కల్లో ఇది ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
నిర్మాతలు కొంతవరకు సేఫ్.. కానీ నష్టాలు తప్పవా?
ఈ డీల్ అడ్వాన్స్ ఆధారంగా జరిగినందున నిర్మాతలు కొంతవరకు సేఫ్ జోన్‌లో ఉన్నప్పటికీ, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి, భారీ అంచనాలతో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా డీలా పడుతూ, ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో నిరాశపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాబోయే రోజుల్లో కలెక్షన్స్‌లో మార్పు వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram