Ustaad Bhagat Singh | ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి… థియేటర్లలో నిరాశ, డిజిటల్‌లో ఫ్యాన్స్‌కు ట్రీట్!

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. గురువారం (ఏప్రిల్ 16) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పవర్ స్టార్ మేనియా మరోసారి డిజిటల్ ప్రపంచాన్ని తాకింది.

Reported by: Sandeep | సినిమా | Apr 16, 2026, 7:51 am IST
Read Time: 5 mins
Ustaad Bhagat Singh | ఓటీటీలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి… థియేటర్లలో నిరాశ, డిజిటల్‌లో ఫ్యాన్స్‌కు ట్రీట్!

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. గురువారం (ఏప్రిల్ 16) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో పవర్ స్టార్ మేనియా మరోసారి డిజిటల్ ప్రపంచాన్ని తాకింది.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, పవన్ కల్యాణ్-హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా. వీరిద్దరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని సాధించడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను ఈ చిత్రం పూర్తిగా అందుకోలేకపోయింది.

మిశ్ర‌మ స్పంద‌న‌..

థియేటర్లలో విడుదలైనప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మిశ్రమ స్పందనను అందుకుంది. పవన్ కల్యాణ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తూ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో అభిమానులను అలరించాడు. సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించి గ్లామర్, కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. అయినప్పటికీ, కథ, స్క్రీన్‌ప్లే పరంగా బలహీనతల కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. రూ.100 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను కూడా దాటలేకపోయింది.

ఇప్పుడు ఓటీటీలో మాత్రం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతూ విస్తృత ప్రేక్షకాదరణ పొందే అవకాశముంది.

కథ ఏమిటంటే:

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ పాత్రలో కనిపిస్తాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడిని చంద్రశేఖర్ రావు (కె.ఎస్. రవికుమార్) దత్తత తీసుకుని పెంచుతాడు. అతని ఆవేశం, ధైర్యం చూసి ‘భగత్ సింగ్’ అనే పేరు పెడతాడు.

కాలక్రమేణా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. అయితే చెదలమర్రి నల్లనాగప్ప (పార్థీబన్) సీఎం పదవిపై కన్నేసి, అతన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఈ కుట్రల మధ్య ఏసీపీ ఉస్తాద్ భగత్ సింగ్ తన గురువైన సీఎంను ఎలా కాపాడతాడు అన్నదే సినిమా ప్రధాన కథ.

ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్:

బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ, ఈ సినిమా పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రం మంచి ట్రీట్‌గా నిలుస్తోంది. పవన్ యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇద్దరు హీరోయిన్లతో అతని కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

థియేటర్లలో మిస్సైన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.