సూర్యాపేట జిల్లాలో మైనింగ్ స్కామ్ : సీఎం రేవంత్ కు కేటీఆర్ లేఖ

సూర్యాపేట మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలున్నాయని కేటీఆర్ ఆరోపణ. టెండర్లు రద్దు చేసి స్వతంత్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్‌కు లేఖ.

Revanth Reddy vs KTR

విధాత, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో మైనింగ్ ఈ-వేలంలో భారీ అక్రమాలు జరిగాయని, స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. సుమారు 1,100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్‌పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహించారని, కీలక సాంకేతిక వివరాల లోపం – Latitude–Longitude, DGPS సర్వే వివరాలు వెల్లడించలేదని లేఖలో ఆరోపించారు. జియోలాజికల్ నివేదికలు లేవని, మినరల్ ఆక్షన్ రూల్స్–2015 ఉల్లంఘన జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైకోర్టు సూచనలు పట్టించుకోలేదు.. పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్ల ప్రకటనపైన, కంపెనీల ఎంపికపైన అనుమానాలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మైనింగ్ అక్రమాలు, కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్‌కు బ్లాక్‌ల కేటాయింపుపై సందేహాలు వెలిబుచ్చారు. టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని అనుమతుల తర్వాతే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి :

Andhrapradesh : ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై రేగిన రచ్చ !
Rahul Gandhi| యుద్దానికి మనం సిద్దం కావాలి : రాహుల్ గాంధీ

Latest News