విధాత : ఓ మొసలికి నదిలో లభించే ఆహారం తిని బోరు కొట్టిందో..లేక విద్యార్థులకు వండి పెడుతున్న ఆహారం రుచి చూడాలనుకుందో ఏమోగాని ఏకంగా ఓ హాస్టల్ మెస్ లోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజస్థాన్‌లోని కోటా నగరంలోని బోరాఖేడా ప్రాంతంలో ఉన్న ఓ బాలుర హాస్టల్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. తాజాగా హాస్టల్ బేస్‌మెంట్‌లోని మెస్‌లోకి సుమారు 4 అడుగుల పొడవైన మొసలి ప్రవేశించింది. ఒక్కసారిగా మొసలిని చూసిన విద్యార్థులు భయంతో కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. మెస్ లో విద్యార్ధులకు పిండి కలుపుతు ఆహారం సిద్దం చేస్తున్న కుక్ మొసలి ఎంట్రీని చేసి మెస్ నుంచి బయటకు పరుగు పెట్టాడు.
ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని సురక్షితంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి తరలించారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు హాస్టల్ మెస్ లో ఆ మొసలి ఆకస్మిక తనిఖీకి వచ్చిన అధికారిలా కనిపించిందంటూ సెటైర్లు వేశారు.
మగ్గర్ మొసళ్లకు ప్రసిద్ధి చెందిన చంబల్ నది ఒడ్డున కోటా నగరం ఉండటం వల్ల, అక్కడి అనేక విద్యార్థి హాస్టళ్లలోకి ఇలాంటి వన్యప్రాణుల చొరబాట్లు జరగడం సహజం అని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
कोटा के हॉस्टल की मेस में घुसा 4 फीट लंबा मगरमच्छ, छात्रों में मचा हड़कंप! 🐊😱#Kota #Rajasthan #Crocodile #Hostel #HostelNews #ViralVideo #Wildlife pic.twitter.com/JaKITmRrkv
— अविनाश गुप्ता (@Avinash_gupta55) July 19, 2026