విధాత : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణలో భాగంగా ప్రభుత్వం శంషాబాద్ బహదూర్ గూడ రైతులకు చెందిన 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. తొమ్మిది రోజులుగా నిర్వాసితులు తమకు పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వమని.. గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. రైతులు దీక్షా శిబిరాన్ని అర్థరాత్రి భారీ పోలీసుబలగాలు తొలగించి.. రైతులను అక్కడి నుంచి తరలించారు. భారీ బందోబస్తుతో బహదూర్‌గూడను దిగ్బంధించారు. పోలీసులు రాత్రికి రాత్రి రైతులను వేరే ప్రాంతాలకు తరలించి.. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు తొలగించారు.
పోలీసు పహారాలో ప్రభుత్వం సేకరించిన రైతులకు చెందిన 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా, రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. బహదూర్‌గూడ గ్రామాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని..ఇతరులను ఎవరిని అక్కడికి రాకుండా పహారా పెట్టారు.
బహదూర్‌గూడలో రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్ గూడలో భూములు కోల్పోతున్న రైతులను బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డిలు పరామర్శించారు. ప్రభుత్వం తమ భూముల్ని అక్రమంగా లాక్కుంటోందని, మా భూములను కాపాడాలంటూ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ మొరపెట్టుకున్నారు. మా పొలాలకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారని, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సాగు భూములకు ఫెన్సింగ్ వేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తరఫున తాము న్యాయం చేస్తామని.. ధైర్యంగా ఉండాలంటూ సబితా ఇంద్రారెడ్డి భరోసానిచ్చారు.
బహదూర్‌గూడలో రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
ప్రభుత్వం తమ భూముల్ని అక్రమంగా లాక్కుంటోందని, భూములను కాపాడాలంటూ రైతుల ఆవేదన
బీఆర్ఎస్ తరఫున తాము న్యాయం చేస్తామని.. ధైర్యంగా ఉండాలంటూ సబితా ఇంద్రారెడ్డి భరోసా pic.twitter.com/sx1koEF1Uf
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 19, 2026