వానల కోసం గాడిదలకు పెళ్లి!

ఎలినినో ప్రభావంతో వర్షభావం ఏర్పడి పంటలు ఎండిపోతున్నాయి. వరుణుడి కరుణ కోసం దేవాలయాలలో పూజలు, బొడ్రాయి అభిషేకాలు, గ్రామదేవతల పండుగలతో రైతులు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. కప్పల పెళ్లిళ్లు వంటి తంతులు నిర్వహిస్తున్నారు. అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామస్థులు మాత్రం వర్షాల కోసం వింత సాంప్రదాయాన్ని ఆచరించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Jul 19, 2026, 11:23 am IST
Read Time: 3 mins
వానల కోసం గాడిదలకు పెళ్లి!

అమరావతి : ఎలినినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు, గ్రామీణ ప్రజలు వర్షాల కోసం అల్లాడిపోతున్నారు. ఖరీఫ్ సీజన్ పంటల సాగు చేపట్టిన రైతాంగం ఇప్పటికే వేసిన విత్తనాలు వానలు పడక భూమిలోని వృథా అయిపోగా..మొలకెత్తిన పంటలు సైతం నీటి తడి లేక ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరుణుడి కరుణ కోసం దేవాలయాలలో పూజలు, బొడ్రాయి అభిషేకాలు, గ్రామదేవతల పండుగలతో దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. కప్పల పెళ్లిళ్లు వంటి తంతులు నిర్వహిస్తున్నారు.

అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామస్థులు మాత్రం వర్షాల కోసం వింత సాంప్రదాయాన్ని ఆచరించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గాడిదలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. అనంతం వధువరులైన గాడిదల జంటను గ్రామంలో ఊరేగించారు.  గతంలో ఇలా చేయడం వల్ల వర్షాలు పడ్డాయని, ఈసారి కూడా వరుణ దేవుడు కరుణిస్తాడని గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు. ఈ వింత ఆచారం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారింది.