మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !

ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో 12 ఏళ్ల బాలుడిని బలిగొన్న మ్యాన్ ఈటర్ మొసలిని అటవీశాఖ, గ్రామస్తులు సంయుక్తంగా బంధించారు. ఘాగ్రా నది ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 18, 2026, 5:14 pm IST
Read Time: 2 mins
మ్యాన్ ఈటర్ మొసలిని బంధించారు !

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడిని బలిగొన్న మొసలిని అటవీ శాఖ సిబ్బంది, స్థానిక గ్రామస్తుల బృందం విజయవంతంగాపట్టుకుంది. బాలుడు అతని మామతో పాటు పొలం పనుల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఘాగ్రా (సరయూ) నదీ తీరంలో చేతులు, కాళ్లు కడుక్కుంటున్న సమయంలో ఆ క్రూరమైన మొసలి దాడి చేసింది. బాలుడిని నీటిలోకి లాక్కెళ్లి చంపేసింది. మామా నిస్సహాయంగా చూస్తుండగానే, ఆ మొసలి బాలుడిని ఘాగ్రా నదిలోకి లాక్కెళ్లింది. కొన్ని గంటల తర్వాత బాలుడి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

అప్పటికే అతని మృతదేహాన్ని నడుం వరకు తినేసింది. తల్లిదండ్రులను చిన్నప్పుడే కొల్పోయిన బాలుడు తన మామా ఆశ్రయంలో పెరుగుతున్నాడు. చివరికి మొసలి దాడికి గురై ఆ బాలుడు చనిపోవడం గ్రామస్తులను, కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది. అంతా పట్టుదలతో వ్యవహరించి మ్యాన్ ఈటర్ గా మారిన ఆ భయంకర మొసలిని బంధించారు.