చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు గిరిజనులు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. రెస్క్యూ బృందాలు మృతదేహాలను వెలికితీశాయి.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Jul 18, 2026, 4:40 pm IST
Read Time: 2 mins
చేపల వేటలో విషాదం..గోదావరిలో ఐదుగురు గల్లంతు

ఏపీలోని పోలవరం జిల్లా గోదావరిలో చేపల కోసం వెళ్లిన ఐదుగురు గిరిజనులు గల్లంతయ్యారు. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపలు పడుతుండగా కొట్టుకుపోయారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. లోతుగా ఉన్న ప్రాంతంలో చేపలు పడుతుండగా వారంతా గల్లంతయ్యారని స్థానికుల కథనం. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.

మృతదేహాలను రెస్క్యూ బృందం వెలికితీసింది. మృతులను సుశీల, లక్ష్మి, భారతీ, బాలరాజు, రమేష్‌గా గుర్తించారు. గోదావరిలో గేలాలతో చేపలు పట్టేందుకు 8 మంది బృందం వెళ్లారు. గోదావరి వరద నీరు ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు వరద నీటిలో కొట్టుకుపోయారు.