Chandrababu Delhi Visit : ఢిల్లీలో చంద్రబాబు బిజీ బిజీ..విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న సీఎం చంద్రబాబు విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం దక్కినట్లు తెలిపారు. కేంద్ర మంత్రులతో కీలక అభివృద్ధి అంశాలపై చర్చించారు.
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా స్వయంగా కేంద్ర మంత్రి ఖట్టర్ విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు చంద్రబాబుతో వెల్లడించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే.
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ ప్రాజెక్టులకు అనుమతులు తదితర అంశాలపై ఆమెతో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో.. దానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో బిల్లు పెట్టాలని అమిత్‌షాను చంద్రబాబు కోరినట్లు సమాచారం.
చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పోలవరం నిర్మాణ పురోగతితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థికసాయంపై చర్చించారు. జల్ జీవన్ మిషన్ పథకానికి నిధులు తదితర అంశాలపై కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. పలు ప్రాజెక్టులకు కేంద్ర సాయం పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు స్టాప్ వర్క్‌ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. దీని కారణంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిలో అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్-2కి ఆర్థిక సాయం అందించాలని.. భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని సీఆర్ పాటిల్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. దీనికి అదనంగా సుమారు రూ.32వేల కోట్ల నిధులు అవసరమని తెలిపారు.
నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం నల్లమ సాగర్ కిం్ ప్రాజెక్టుకు అనుమతినివ్వాలని చంద్రబాబు కోరారు. ఈ ప్రాజెక్టుకు అలాగే సాంకేతిక, ఆర్థిక సహాయం చేయాలని కూడా అభ్యర్థించారు. ఏపీ సరిహద్దు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరిచాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
Loksabha Speaker Om Birla : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ చోరీ.. 50 ల్యాప్‌టాప్‌లు మాయం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram