HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ చోరీ.. 50 ల్యాప్‌టాప్‌లు మాయం
HCU | గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ప్రతిష్టాత్మక సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ చోరీ జరిగింది. రూ. 25 లక్షల విలువైన 50 ల్యాప్‌టాప్‌లను గుర్తు తెలియని దుండగులు అపహరించారు.

సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ కు సంబంధించిన ఓ తరగతి గది కిటికీ గ్రిల్స్‌ను చాకచక్యంగా తొలగించారు. అనంతరం దుండగులు లోపలికి ప్రవేశించి 50 ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. అయితే దొంగిలించిన ల్యాప్‌టాప్‌లను కారులో తరలించినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. యూనివర్సిటీ సెక్యూరిటీ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram