Loksabha Speaker Om Birla : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్ష కూటమి నోటీసు ఇచ్చింది. 118 మంది ఎంపీల సంతకాలతో నోటీసు అందజేయగా, రెండో విడత సమావేశాల్లో చర్చకు అవకాశం ఉంది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 10, 2026, 3:20 pm IST
Read Time: 3 mins
Loksabha Speaker Om Birla : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్

న్యూఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి విపక్షాలు నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్‌ ఎంపీలు కె.సురేశ్‌, మహమ్మద్‌ జావెద్‌ నోటీసు అందజేశారు. రూల్‌ 94సీ కింద నోటీసు ఇచ్చామని ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ తెలిపారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేతో సహా పలు పార్టీలకు చెందిన ఎంపీలు సంతకాలు చేశారు.

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం, కాంగ్రెస్‌ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దుబెపై చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. బడ్జెట్ తొలి విడత సమావేశాలు జనవరి 8న ప్రారంభమై ఫిబ్రవరి 13న ముగియనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండో విడత సమావేశాల్లోనే అవిశ్వాసంపై చర్చకు అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ పై కాంగ్రెస్ కూటమి పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, విపక్షాల వద్ద తీర్మానాన్ని నెగ్గించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి :

సిద్దిపేటకే నిధులు..రేవంత్ తో హరీష్ రావు బంధానికి నిదర్శనం : కవిత ఫైర్
Fish Farming | కాసులు కురిపిస్తున్న చేప‌ల చెరువు.. ఏడాదికి రూ. 36 ల‌క్ష‌లు సంపాదిస్తున్న మ‌హిళా ఇంజినీర్..