విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,950వద్ద కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,31,950 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. రూ.2,45,000గా కొనసాగుతుంది.
అంతర్జాతీయంగా, దేశీయంగా బులియన్ మార్కెట్ లలో బంగారం ధరలు తాత్కాలికంగా అస్థిరంగా కొనసాగుతాయని, ముఖ్యంగా మరింత తగ్గుదల నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. అయితే రాబోయే మూడు నెలల కాలంలో ధరలు మళ్లీ పుంజుకోవచ్చని వారు భావిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికన్ డాలర్ కదలికలు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో బులియన్ మార్కెట్ గమనాన్ని శాసించనున్నాయని అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా పసిడి మద్దతు స్థాయి పడిపోతే..దేశీయంగా రూ. 1,34,000 నుండి రూ. 1,25,500 వరకు పతనం కావచ్చంటున్నారు. ఒకవేళ నిరోధక స్థాయిని దాటితే మాత్రం10 గ్రాముల బంగారం ధర రూ. 1,52,000 నుంచి గరిష్టంగా రూ. 1,60,500 వరకు చేరే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. దేశీయంగా శుభాకార్యాల సీజన్ లో బంగారం, వెండి అవసరమైన వారికి ప్రస్తుత ధరలు..కొనుగోలుకు సానుకూలంగా భావించవచ్చంటున్నారు.