విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,200పెరిగి రూ. 1,43,950 కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,100పెరిగి రూ.1,31,950 వద్ద నిలిచింది. ఇక కిలో వెండి ధర అనూహ్య పతనం తర్వాత రూ.2,45,000వద్ద స్థిరంగా ఉంది. జూన్ 18న కిలో వెండి ధర రూ. 2,70,000 ఉండగా…ప్రస్తుతం రూ.25,000తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ డాలర్ నిరంతరాయంగా బలపడుతుండటం, ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు మరికొంత కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగుతాయనే అంచనాలు, పెరుగుతున్న ద్రవ్యోల్భణం అన్నీ కలిపి బులియన్ మార్కెట్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు పతనాన్ని నమోదు చేస్తున్నాయి. దేశీయంగా బంగారం, వెండి ధరలు తాత్కాలికంగా మరింత తగ్గుదల నమోదు చేయవచ్చని..ఈ పరిస్థితులు కొనుగోలుకు అనుకూలం అని నిపుణులు అంచనా వేస్తున్నారు.