న్యూఢిల్లీ: వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసంంతో నెలకొన్న ఆస్తి,ప్రాణ నష్టాల లెక్క తేలకముందే వెనెజులా దేశంలో మరో భూకంపం సంభవించింది. ఈసారి దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. దీంతో వరుస భూకంపాలతో ఏం జరుగుతుందోనంటూ ఆ దేశ వాసులు కంటిమీద కునుకులేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంతకుముందు బుధవారం సాయంత్రం 7.2, 7.5 తీవ్రతతో క్షణాల వ్యవధిలో వచ్చిన రెండు భూకంపాలతో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోగా, వేలాది మంది ఆసుపత్రుల పాలయ్యారు. భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. వందల భవనాలు కూలిపోవడంతో సహాయకచర్యలు క్లిష్టంగా మారాయి.
ఈ ప్రకృతి విపత్తుతో ఇప్పటికే 1000మంది వరకు ప్రాణాలు కోల్పోగా..4వేల మంది గాయాలపాలయ్యారు. దాదాపు మరో 50 వేల మంది జాడ ఇంకా తెలియరాలేదు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని భయాందోళన వ్యక్తమవుతోంది.వెనెజులాకు ప్రత్యక్షంగా 6.7 బిలియన్ డాలర్ల (రూ.63వేల కోట్ల) మేర నష్టం వాటిల్లిందని ఐరాస అంచనా వేసింది. పరోక్ష ప్రభావాన్నీ లెక్కిస్తే ఇంకా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయపడింది
పాకిస్థాన్‌లో భూకంపం..
పాకిస్థాన్‌లో కూడా శనివారం ఉదయం భూకంపం వచ్చింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైంది. 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్ మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఈ భూకంపంతో ఏమైనా ఆస్తి, ప్రాణనష్టం సంభవించిందా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది.