బంగారం, వెండి ధరలు పైపైకే..!

ఆదివారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,39,650 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర సైతం రూ.2,49,900వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Aug 09, 2026, 11:05 am IST
Read Time: 3 mins
బంగారం, వెండి ధరలు పైపైకే..!

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా పరిణామాలు, అంతర్జాతీయంగా ఆర్థిక మార్పుల నేపథ్యంలో తీవ్ర కుదుపులకు లోనైన బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే MCX లో బంగారం ధర రూ. 7 వేలకు పైగా పెరిగింది. వెండి ఏకంగా రూ.13 వేలకు పైగా పెరిగింది. ఆదివారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,350 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,39,650 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర సైతం రూ.2,49,900వద్ద కొనసాగుతుంది.

మునుముందు మరింత పైకి..

పశ్చిమాసియా సంక్షోభంతో పడిపోయిన బంగారం, వెండి ధరలు మునుముందు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య పుంజుకుంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రెండ్స్ ప్రకారం బంగారం రూ.1,48,000 మద్దతు స్థాయి పైన స్థిరపడి రూ.1,60,000 వైపు పయనించే సూచనలు ఉన్నాయి. వెండి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 55 డాలర్ల నుండి 68 డాలర్ల పరిధిలో తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది.

యూఎస్ ఫెడరల్ వడ్డీ నిర్ణయాలు, ద్రవ్యోల్బణ డేటాపై, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత వంటి అంశాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పైపైకి వెలుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తే బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను తాకవచ్చంటున్నారు.