• Telugu News
  • /Business

మరింత పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,780తగ్గి రూ. 1,40,130కి దిగివచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,28,450వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 10,000 తగ్గి రూ. 2,30,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 25, 2026, 12:09 pm IST
Read Time: 3 mins
మరింత పతనమైన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో శాంతి పరిస్థితుల దిశగా అమెరికా-ఇరాన్ అవగాహానకు రావడంతో అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వాటి ప్రభావం బంగారం, వెండి ధరలపై ప్రతికూలత చూపుతుంది. వరుసగా నాల్గవ రోజు గురువారం బంగారం, వెండి ధరలు మరింత పడిపోయాయి.

24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,780తగ్గి రూ. 1,40,130కి దిగివచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,28,450వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 10,000 తగ్గి రూ. 2,30,000వద్ద కొనసాగుతుంది.

కొనుగోలుకు ఊతం..

దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా వరుస పతనంతో న్న పసిడి ధరలు తాజాగా మరింత దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగుతుందనే అంచనాలు, అలాగే భౌగోళిక ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం వల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో బంగారం ధరలు గణనీయంగా క్షీణించాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ భారీ నష్టాలను నమోదు చేశాయి. బంగారం, వెండి ధరల తగ్గుదల ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా మారింది.