ఏపీ స్వర్ణగిరి..జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రూ.405 కోట్ల పెట్టుబడితో జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్-డెక్కన్ గోల్డ్ మైన్స్ నేతృత్వంలోని గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను చంద్రబాబు ప్రారంభించడంతో పాటు ఈ ప్లాంటు విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు శంకుస్థాపన చేసి, గోల్డ్ ప్రాసెసింగ్ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. దేశంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ గా జొన్నగిరి మైన్ గుర్తింపు పొందింది. ఏడాదికి 400 కేజీలతో ప్రారంభించి తదుపరి దశలో 900 కేజీలు, అనంతరం 2 టన్నుల వరకూ ఉత్పత్తి చేసేలా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు కొనసాగనుంది. చంద్రబాబుకు మైనింగ్ నుంచి తుది ఉత్పత్తి వరకూ జరిగే ప్రక్రియలను జియో మైసూర్ సంస్థ చైర్మన్ ప్రభాకరన్, ఎండీ నవీన్ లాల్ చంద్ర తదితరులు వివరించారు.
రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైంది
జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం అని, ఆ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైందని చంద్రబాబు అన్నారు. జొన్నగిరి స్వర్ణగిరి పేరు పెట్టుకుందామని, నా స్వర్ణాంధ్రప్రదేశ్ కల స్వర్ణగిరితో నెరవేరినట్లయ్యిందని చమత్కరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభపరిణామం అని, జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టుపై రూ.405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారని, జొన్నగిరి బదులు ఈ ప్రాంతానికి మళ్లీ స్వర్ణగిరి అని పేరు పెట్టుకుందాం అన్నారు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు అని గుర్తు చేశారు. అశోకుడి నాలుగు రాజధానుల్లో సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి ఒకటి అని, వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండి ఉండేదని పేర్కొన్నారు. ఇక్కడకు దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చెబుతున్నాయని, రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని, ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానిదేనని గుర్తు చేశారు. కాలక్రమేనా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయి అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశాం. గోల్డ్ మైనింగ్ తో సీమకు పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్దికి ఒక గ్రోత్ ఇంజిన్
2047కు దేశాన్ని వికసిత్ భారత్ గా తయారు చేయాలన్నది ప్రధాని మోదీ కల అయితే.. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది నా ఆలోచన అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చిందని, ఇక ఇక్కడి ప్రజల జీవితాలు కూడా స్వర్ణమయం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని స్వర్ణగిరి మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తారన్నారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం అని, స్వర్ణగిరి గ్రామం నుంచే ఈ ప్రణాళిక ప్రారంభం అయ్యింది. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించే మాట్లాడుతుందని తెలిపారు.
దేశం ఇప్పుడు 800 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. చమురు తర్వాత ఇదే అతిపెద్ద దిగుమతి అని, బంగారం అంటే మనందరికీ ఎంతో మమకారం. బంగారం ఉంటే మనకు గౌరవంగా భావిస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక్కడ ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని, తొలి ఏడాది 400 కిలోలు నుంచి ప్రారంభించి 50 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తికి చేరుకుంటాం, ఏటా ఉత్పత్తి అయ్యే 1 టన్ను బంగారంతో విదేశీ మారక నిల్వల్ని కొంత కాపాడుకోవచ్చు అన్నారు. స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయని, ఈ గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఈ ప్రాంత అభివృద్దికి ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు.
ఇక్కడే జ్యువెలరీ పార్కు కూడా..
జొన్నిగిరి బంగారం ఎక్కడికో తరలించి ఆభరణాలు తయారు చేసే బదులు ఇక్కడే ఓ జ్యుయలరీ పార్కు కూడా ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు తెలిపారు. ఈ పరిశ్రమకు అనుమతులు, భద్రత కూడా కల్పిస్తాం, ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు…ఆంధ్రప్రదేశ్ అంటే రత్నగర్భ కూడా అని, మన రాష్ట్రంలో పండని పంటలు లేవు… దొరకని ఖనిజాలు లేవు అన్నారు. మంగంపేట బెరైటీస్, కడప లైమ్ స్టోన్, యురేనియం, విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ ఉందన్నారు. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్, కుప్పంలో గ్రీన్ గ్రానైట్, శ్రీకాకుళంలో బ్లూ గ్రానైట్.
గూడూరు మైకా, నెల్లూరు సిలికా, ఉత్తరాంధ్ర తీరంలో బీచ్ శాండ్ ఉన్నాయని గుర్తు చేశారు. అనంతపురం, కడపలో ఐరన్ ఓర్….కేజీ బేసిన్ లో గ్యాస్, పెట్రోల్ వనరులు ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వాల్యూ ఎడిషన్ పరిశ్రలను ప్రోత్సహిస్తున్నాం అన్నారు. సిమెంటు, స్టీల్ పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి అని, ఈ గనులు, వచ్చే పరిశ్రమలతో ఇక్కడి యువతకు ఇక్కడే ఉపాధి కల్పిస్తాం అన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ ఓ మోడల్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీ ఓ మోడల్ అని, గత పాలకులు అక్రమ సంపాదన కోసం పరిశ్రమల్ని బయటకు తరిమేశారని, ఎన్డీఏ ప్రభుత్వ బ్రాండ్ తోనే పారిశ్రామిక వేత్తలు ఏపీకి మళ్లీ క్యూ కడుతున్నారని చంద్రబాబు తెలిపారు. సీమలో ప్రతి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తున్నాం అని, స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, స్టీల్, సిమెంట్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. కర్నూలు జిల్లాలో దేశంలో అతిపెద్ద డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌ను అభివృద్ధి చేస్తున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను తీసుకువస్తాం అని తెలిపారు. అనంతపురంలో నాడు కియా తెచ్చాం. నేడు 5th జనరేషన్ ఫైటర్ జెట్ల ప్రాజెక్టు తెచ్చాం. 2028 ఉత్పత్తి లక్ష్యంగా కడప జిల్లాలో జూలై 3న రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నాం.
కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ది చేస్తున్నాం. తిరుపతిలో రాయల్ ఎన్ ఫీల్డ్ పరిశ్రమ తీసుకువచ్చాం అని చంద్రబాబు తెలిపారు.
సీఎం చంద్రబాబు చేతిలో ‘జొన్నగిరి’ గోల్డ్ pic.twitter.com/cXYTkHexu1
— Publish7 (@srinuvenka41452) June 24, 2026