ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం 25కు పైగా అజెండాలోని అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అందులో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద రూ.25వేలు చొప్పున ఆర్థికసాయం, బాపట్లలో వినికిడిలోపం ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, పుష్కరాలకు భద్రత, బందోబస్తుకు రూ.50 కోట్లు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్‌బ్యాంకు నుంచి ఇచ్చే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఉండేందుకు అంగీకరిస్తూ కేబినెట్ నిర్ణయించింది.
మరిన్ని చదవండి :