తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ తన చివరి సినిమా ‘జన నాయగన్’ ను అభిమానులతో కలిసి థియేటర్‌లో వీక్షించారు. సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రం అంతటా థియేటర్ల వద్ద విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. విజయ్ థియేటర్‌కు చేరుకున్న సమయంలో అభిమానులు నినాదాలు, హర్షధ్వానాలతో ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల సంబరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. నటి త్రిష చెన్నైలోని రోహిణి థియేటర్‌లో ‘జన నాయకన్’ సినిమా వీక్షించారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ పూర్తి స్థాయి రాజకీయ, ప్రజా జీవితంలో నిమగ్నమైన నేపథ్యంలో ఆయన నటించిన చివరి చిత్రంగా అభిమానులు
‘జన నాయగన్’ చిత్రాన్ని భావోద్వేగంతో వీక్షిస్తున్నారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా, డాన్స్ లతో విజయ్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఓ థియేటర్ వద్ద ఓ వృద్ధురాలు ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు ఆమె జోష్‌కు ఫిదా అవుతున్నారు.
విజయ్ ‘జననాయగన్’ జాతర.. థియేటర్ వద్ద అవ్వ స్టెప్పులు వైరల్..
తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ విడుదలతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. థియేటర్ల వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహిస్తుండగా, ఓ వృద్ధురాలు ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా… pic.twitter.com/gYs7SjgzfI
— Telugu Stride (@TeluguStride) July 23, 2026