మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

దేశీయమార్కెట్ లో బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 1,44,330కు పడిపోగా, 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 250 తగ్గి రూ.1,32,300వద్ద నిలిచింది. అటు వెండి ధర మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకేసారి రూ. 10,000తగ్గిన కిలో వెండి ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 24, 2026, 11:45 am IST
Read Time: 2 mins
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా సంక్షోభం సద్దుమణుగడంతో అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక పరిణామాలు క్రమంగా గాడిన పడుతున్నాయి. హర్మూజ్ జలసంధి మార్గం గుండా వాణిజ్య నౌకల పునరుద్దరణతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు దిగివస్తుండటం, డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల ప్రభావం ఇటు బంగారం, వెండి ధరలను సైతం ప్రభావితం చేస్తుంది.

దేశీయ మార్కెట్ లో బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 1,44,330కు పడిపోగా, 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 250 తగ్గి రూ.1,32,300వద్ద నిలిచింది. అటు వెండి ధర మాత్రం భారీగా తగ్గుముఖం పట్టింది. ఒకేసారి రూ. 10,000తగ్గిన కిలో వెండి ధర రూ. 2,40,000 వద్ద కొనసాగుతుంది.

తాత్కాలికంగా బంగారం, వెండి ధరలలో తగ్గుదల నమోదవుతున్నప్పటికి దీర్ఘకాలికంగా వాటి ధరలు పుంజుకుంటున్నాయని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ లో ప్రస్తుతం శుభాకార్యాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోలుకు ప్రస్తుత ధరలు అనుకూలంగా భావించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ధరలు హెచ్చుతగ్గుల పరిణామాలను అంచనా వేస్తూ..కొనుగోలుదారులు పసిడి, వెండి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.