సర్ ఓటర్ లిస్టు మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో భాగంగా కీలకమైన ఓటర్ల ఇంటింటి సర్వే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సర్ సర్వే ప్రక్రియ కోసం బీఎల్ వోలు రాష్ట్రంలోని333,26,448మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించి వాటిని ఎలా నింపాలో వివరిస్తారు. 2002నాటి ఓటర్ల జాబితాను 2025ఓటర్ల జాబితాతో పోల్చి మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ చేస్తున్నారు. సర్ ప్రక్రియ పట్ల ఓటర్లు, సిబ్బంది ఏ మాత్రం పొరపాటు చేసినా..ఓట్లతో పాటు సంక్షేమ పథకాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jun 25, 2026, 12:53 pm IST
Read Time: 8 mins
సర్ ఓటర్ లిస్టు మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)లో భాగంగా కీలకమైన ఓటర్ల ఇంటింటి సర్వే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. సర్ సర్వే ప్రక్రియ కోసం బీఎల్ వోలు రాష్ట్రంలోని333,26,448మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించి వాటిని ఎలా నింపాలో వివరిస్తారు. నింపిన పత్రాల్లో ఒకటి బీఎల్ వో తీసుకుని..మరొకటి రశీద్ గా ఓటర్ కు ఇస్తారు.

మ్యాపింగ్ తప్పనిసరి..

ఎన్యూమరేషన్ పత్రం ఓటర్ కు ఇచ్చిన సమయంలో బీఎల్ ఓల వద్ద మ్యాపింగ్ కు సంబంధించిన వివరాలు ఉంటాయి. మ్యాపింగ్ జరిగితే వాటిని ఎలా నింపాలి..ఆన్ మ్యాపింగ్ అయితే ఎలా నింపాలో బీఎల్ వోలు ఓటర్లుకు వివరిస్తారు. 2002నాటి ఓటర్ల జాబితాను 2025ఓటర్ల జాబితాతో పోల్చి మ్యాపింగ్, అన్ మ్యాపింగ్ చేస్తున్నారు. సర్ ప్రక్రియ పట్ల ఓటర్లు, సిబ్బంది ఏ మాత్రం పొరపాటు చేసినా..ఓట్లతో పాటు సంక్షేమ పథకాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఆన్ లైన్ సదుపాయం..

ఆన్ లైన్ లో ఎన్నికల సంఘం అధికారిక వైబ్ సైట్ లోకి వెళ్లి సైతం ఎన్యూమరేషన్ పత్రం నింపవచ్చు. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ లేదా ఎపిక్ కార్డు నంబర్ తో ఓటర్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యి వివరాలు ఎంట్రీ చేయవచ్చు. అయితే ఓటర్ జాబితాలో ఆధార్ కార్డు పేరు సరిపోలిన ఓటర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. పత్రాలను పూరించడంతో ఏమైనా సందేహాలు ఉన్నా…బీఎల్ వో ఇంటికి రాకపోయినా 1950టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించవచ్చు.

* మీ ఓటర్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలిపే ముఖ్య విషయాలు*

2002 ఓటర్ లిస్ట్ మ్యాపింగ్ – ముఖ్యమైన విషయాలు:

1. ఎవరి కోసం ఈ మెసేజ్?
– 2002 తర్వాత పెళ్లి చేసుకొని అత్తగారి ఊరికి వెళ్లిన ఆడవాళ్ల కోసం.

2. సమస్య ఏంటి?
– మీరు పెళ్లి చేసుకున్న ఊరి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ పేరు ఉండదు.
– ప్రస్తుతం ఓటర్ మ్యాపింగ్ అంతా 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగానే జరుగుతోంది.

3. మీరు ఏం చేయాలి?
– స్టెప్ 1: మీరు పుట్టిన ఊరికి వెళ్లండి.
– స్టెప్ 2: అక్కడి 2002 ఓటర్ లిస్ట్‌లో మీ అమ్మ లేదా నాన్న పేరు, సీరియల్ నంబర్ తెలుసుకోండి.
– స్టెప్ 3: ఆ సీరియల్ నంబర్‌ను మీరు ఇప్పుడు ఉంటున్న ఊరిలోని BLO కి ఇవ్వండి.
– స్టెప్ 4: BLO ఆ నంబర్‌తో మిమ్మల్ని ఇక్కడి ఓటర్ లిస్ట్‌లో మ్యాపింగ్ చేసి చేరుస్తారు.

4. ఇది చేయకపోతే ఏమవుతుంది?
– మీరు మీ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది.

5. 2002 లిస్ట్ ఎక్కడ దొరుకుతుంది?
– ప్రతి ఊరిలో తహసీల్దార్ ఆఫీస్ నుండి 2002 ఓటర్ లిస్ట్‌ను ఆ ఊరి BLO / అంగన్‌వాడీ టీచర్‌కు ఇచ్చారు.
– మీ పుట్టిన ఊరి BLO ని కలవండి.

6. గుర్తుంచుకోవాల్సిన విషయం:
– ఓటు కోల్పోకుండా చూసుకోవడం మన అందరి బాధ్యత.
– అందరూ తప్పకుండా మ్యాపింగ్ చేయించుకోండి.
SIR గురించి చాలా చాలా ముఖ్యమైన సమాచారం

SIR లో 3 రకాల మ్యాపింగ్‌లు ఉన్నాయి. వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం.

1) సెల్ఫ్ మ్యాపింగ్ (Self Mapping)
2) యాడ్ ప్రోజెనీ (Add Progeny)
3) సెల్ఫ్ ప్రోజెనీ (Self Progeny)
━━━━━━━━━━━━━

1) సెల్ఫ్ మ్యాపింగ్ (Self Mapping)

2002 SIR ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండి, అదే విధంగా 2025 ఓటర్ లిస్ట్‌లో కూడా పేరు ఉన్నవారు Self Mapping చేయించుకోవాలి.

అలాంటి వారు BLO వద్దకు వెళ్లి “Self Mapping” చేయాలని చెప్పాలి.
━━━━━━━━━━━━━

2) యాడ్ ప్రోజెనీ (Add Progeny)

2002 సమయంలో ఓటు హక్కు వయస్సు రాకపోవడం వల్ల పేరు లేకపోయినా, ఇప్పుడు 2025 ఓటర్ లిస్ట్‌లో పేరు ఉన్నవారికి ఈ మ్యాపింగ్ వర్తిస్తుంది.

అంటే మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న లేదా అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 SIR లిస్ట్‌లో ఉంటే, మీరు తప్పనిసరిగా “Add Progeny” మ్యాపింగ్ చేయించుకోవాలి.
━━━━━━━━━━━━━

3) సెల్ఫ్ ప్రోజెనీ (Self Progeny)

2002లో మీకు 18 సంవత్సరాలు పూర్తయి ఉన్నా, ఏదైనా కారణం వల్ల 2002 SIR లిస్ట్‌లో మీ పేరు లేకపోతే —
మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, నాన్న లేదా అమ్మ పేర్లలో ఏదైనా ఒకటి 2002 SIR లిస్ట్‌లో ఉంటే, మీరు “Self Progeny” మ్యాపింగ్ BLO ద్వారా చేయించుకోవాలి.
━━━━━━━━━━━━━
ముందుగా 2002 SIR లిస్ట్ చూసి, మీరు ఏ మ్యాపింగ్‌కు చెందుతారో నిర్ణయించుకోవాలి.

అలాగే 2002 SIR లిస్ట్‌లో మీ నాన్న / అమ్మ / తాత / అమ్మమ్మ / నానమ్మ పేరు ఉన్న పేజీ ప్రింట్ తీసుకుని, మీ ప్రస్తుత ఓటర్ IDతో కలిసి BLO వద్దకు తీసుకెళ్లాలి.

BLO వద్దకు వెళ్లిన తర్వాత “Self Mapping”, “Add Progeny”, “Self Progeny” అనే పదాలను మనమే స్పష్టంగా చెప్పి మ్యాపింగ్ చేయించుకోవాలి.

ఎందుకంటే BLOలకు ప్రతి ఒక్కరి పరిస్థితి తెలియకపోవచ్చు. ఎక్కువగా వారు అంగన్‌వాడీ టీచర్లు లేదా ఆశా వర్కర్లు అయి ఉంటారు. కాబట్టి మనమే మన పరిస్థితికి సరిపోయే మ్యాపింగ్ ఏదో చెప్పి చేయించుకోవడం చాలా ముఖ్యం.