భూమి నుంచి వెలికితీసిన అతిపెద్ద బంగారు ముద్దలు ఏమిటన్న వివరాలు పసిడి ప్రియులకు ఎప్పటికి ఆసక్తిరమే. ఇప్పటిదాక చరిత్రలో కనుగొనబడిన అతిపెద్ద బంగారు ముద్ద ‘వెల్‌కమ్ స్ట్రేంజర్’. 1869లో ఆస్ట్రేలియాలో కనుగొనబడిన ఈ బంగారం ముద్ద బరువు 72 కిలోల కంటే ఎక్కువే. అయితే దానిని కనుగొన్న వెంటనే కరిగించి ముక్కలు చేశారు. అందువల్ల, ఇప్పటికీ కరిగించకుండా చెక్కుచెదరకుండా ఉన్న అతిపెద్ద బంగారు ముద్దగా ‘పెపిటా కానా’ నిలిచింది.
బ్రెజిల్ లోనే అతిపెద్ద బంగారు ముద్ద.. ‘పెపిటా కానా’
భూమిపై ప్రస్తుతం మిగిలి ఉన్న అతిపెద్ద సహజ బంగారు ముద్దను ‘పెపిటా కానా’ తన రికార్డును కొనసాగిస్తుంది. 1980ల ప్రారంభంలో బ్రెజిల్‌లోని సెర్రా పెలాడా గోల్డ్ మైన్స్ లో వెలికితీసిన అతిపెద్ద బంగారు ముద్ద ఇది. ఈ బంగారు ముద్ద మొత్తం బరువు సుమారు 60.8 కిలోగ్రాములు (134 పౌండ్లు). ఇందులో దాదాపు 52.3 కిలోగ్రాములు (1,682 ట్రాయ్ ఔన్సులు) స్వచ్ఛమైన బంగారం ఉంది. ఇది ఇప్పటికి బ్రెజిల్ బ్రాసిలియాలోని సెంట్రల్ బ్యాంకు మ్యూజియంలో ప్రదర్శనలో ఉంది. మార్కెట్ విలువ ప్రకారం దీని ధర సుమారు $3 మిలియన్ల (దాదాపు ₹25 కోట్లు) వరకు ఉంటుందని అంచనా.
వెరీ స్పెషల్ “హ్యాండ్ ఆఫ్ ఫెయిత్”
ఇక చేతి మెటల్ డిటెక్టర్ సహాయంతో గుర్తించి వెలికితీసిన బంగారం ముద్దగా “హ్యాండ్ ఆఫ్ ఫెయిత్” గుర్తింపు పొందింది.
1980లో, ఔత్సాహిక గని కార్మికుడైన కెవిన్ హిల్లియర్, ఆస్ట్రేలియాలో విక్టోరియా రాష్ట్రంలో స్వస్థలమైన వెడ్డర్‌బర్న్‌లో కేవలం ఒక సాధారణ మెటల్ డిటెక్టర్‌ను ఉపయోగించి 27.2 కిలోల “హ్యాండ్ ఆఫ్ ఫెయిత్” బంగారు ముద్దను వెలికితీశాడు. డిటెక్టర్‌తో ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద బంగారు ముద్దగా రికార్డు పొందింది. అతనికి భూమిలో కేవలం ఒక అడుగు లోపల.. 12 అంగుళాల (30 సెం.మీ.) కన్నా తక్కువ లోతులో ఈ 61 పౌండ్ల బంగారు ముద్ద దొరుకడం విశేషం. దాని బరువు 875 ట్రాయ్ ఔన్సులు (27.2 కిలోగ్రాములు లేదా 61 పౌండ్లు 11 ఔన్సులు). నిజంగా ఇది ఒక అద్భుతమే.
భూమిలో మిగిలిన బంగారం 70,550 టన్నులే..
మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 2,06,000 టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీశారు. భూమి గర్భంలో బంగారం నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ఓ రిపోర్ట్ ప్రకారం.. భూమి లోపల ఇంకా కేవలం 70,550 టన్నుల బంగారం మాత్రమే మిగిలి ఉంది. అంటే మనం ఇప్పటికే సింహభాగం బంగారాన్ని వాడేసుకున్నాం. భూమి లోపల ఉన్న నిల్వల కంటే ఎక్కువగా సముద్రాల అడుగున బంగారం ఉందని అంచనా. అయితే సముద్రపు నీటి నుంచి లేదా అడుగున ఉన్న గనుల నుండి బంగారాన్ని వేరు చేయడం అత్యంత ఖరీదైన, కష్టమైన పని కావడంతో అది అలాగే ఉండిపోయింది.
ప్రస్తుతం భూమి నుంచి వెలికి తీసిన బంగారంలో సింహభాగం అంటే 45 శాతం ఆభరణాల రూపంలోనే ఉండటం విశేషం. మిగిలిన దాంట్లో 22 శాతం గోల్డ్ బార్లు, కాయిన్ల రూపంలో ఉండగా, కేవలం 17 శాతం మాత్రమే వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వ ఉంది. దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా దేశాల భూభాగంలోనే భారీ నిల్వలు ఉన్నాయి. బంగారం ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, నిల్వల విషయంలో మాత్రం అమెరికా టాప్‌లో ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేది సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలేనని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. . అమెరికా వద్ద 8,133.5 టన్నులు, జర్మనీ 3,351.6 టన్నులు, ఇటలీ 2,451.9 టన్నులు, ఫ్రాన్స్ 2,437 టన్నులు రష్యా వద్ద 2,332.7 టన్నుల బంగారం ఉంది.
In 1980, amateur prospector Kevin Hillier unearthed the 27.2 kg “Hand of Faith” gold nugget in Australia using nothing more than a basic metal detector.
It’s still the largest gold nugget ever found with a detector. pic.twitter.com/LldSuHQXZ4
— Massimo (@Rainmaker1973) June 24, 2026