No-Confidence motion । అదీ అవిశ్వాసం దెబ్బ!

ప్రధానిని లోక్‌సభకు తెప్పించిన తీర్మానం ప్రభుత్వాన్ని ఓడిస్తామని అనుకోవట్లేదు ప్రధాని మాట్లాడాలన్నదే మా డిమాండ్‌ కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రధాని సభలోకి వస్తున్నప్పుడు వ్యాఖ్యలు No-Confidence motion । మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చి, ప్రకటన చేసేందుకు ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం అనే పార్లమెంటరీ అస్త్రాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి వ్యాఖ్యానించారు. ‘అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తి.. ఈ రోజు ప్రధాన మంత్రి […]

  • By: Somu    latest    Aug 10, 2023 12:44 PM IST
No-Confidence motion । అదీ అవిశ్వాసం దెబ్బ!
  • ప్రధానిని లోక్‌సభకు తెప్పించిన తీర్మానం
  • ప్రభుత్వాన్ని ఓడిస్తామని అనుకోవట్లేదు
  • ప్రధాని మాట్లాడాలన్నదే మా డిమాండ్‌
  • కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ చౌదరి
  • ప్రధాని సభలోకి వస్తున్నప్పుడు వ్యాఖ్యలు

No-Confidence motion । మణిపూర్‌ అంశంపై ప్రధాని నరేంద్రమోదీ సభకు వచ్చి, ప్రకటన చేసేందుకు ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మానం అనే పార్లమెంటరీ అస్త్రాన్ని ఉపయోగించాల్సి వచ్చిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి వ్యాఖ్యానించారు. ‘అవిశ్వాస తీర్మానానికి ఉన్న శక్తి.. ఈ రోజు ప్రధాన మంత్రి (Prime Minister)ని పార్లమెంటుకు రప్పించింది. మేం ఎవరమూ అవిశ్వాస తీర్మానం గురించి ఆలోచించడం లేదు. మేం డిమాండ్‌ చేస్తున్నదల్లా ప్రధాని సభకు వచ్చి, మణిపూర్‌ హింసపై (Manipur issue) ప్రకటన చేయాలనే. ఎవరో బీజేపీ సభ్యడిని సభకు రావాలని మేం డిమాండ్‌ చేయడం లేదు.. మన ప్రధాని సభకు రావాలనే మేం డిమాండ్‌ చేస్తున్నాం’ అని ఆయన అన్నారు.

ప్రధాని గురువారం లోక్‌సభ(Lok Sabha)కు వచ్చారు. హాల్‌లోకి ప్రవేశించి.. తన సీట్లో ఆసీనుడవుతున్న సమయంలో అధిర్‌ రంజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఓడించగల సంఖ్యా బలం మాకు లేదని తెలుసు. కానీ.. మణిపూర్‌ అంశంలో ప్రధాని ఏం చెబుతారో వినాలని మేం కోరుకుంటున్నాం’ అని అధిర్‌ రంజన్‌ చౌదరి (Adhir Ranjan Chowdhury) చెప్పారు. ‘బహుమత్‌కి బాహుబలి ఆప్‌కే పాస్‌ హై. ఔర్‌ ఆప్‌ జీత్‌ సక్తే హై’ అని రంజన్‌ వ్యాఖ్యానించారు. అయితే.. ప్రధానిపై రంజన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు అధికార పక్ష సభ్యులు ప్రయత్నించడంతో సభలో గందరగోళం చెలరేగింది.