స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 270 పెరిగి రూ. 1,41,600వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 100 పెరిగి రూ.250 పెరిగి రూ. 1,29,800వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం రూ. 100తగ్గి రూ. 2,29,900వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 26, 2026, 10:13 am IST
Read Time: 3 mins
స్వల్పంగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : ఇరాన్-అమెరికా యుద్ద పరిస్థితులు సద్దుమణిగిన నేపథ్యంలో అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక పరిణామాలలో చోటుచేసుకుంటున్న మార్పులు బంగారం, వెండి ధరలపై తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. మూడురోజులుగా వరుస తగ్గుదలను నమోదు చేసిన బంగారం ధరలు శుక్రవారం మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 270 పెరిగి రూ. 1,41,600వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 100 పెరిగి రూ.250 పెరిగి రూ. 1,29,800వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం రూ. 100తగ్గి రూ. 2,29,900వద్ద కొనసాగుతుంది.

ప్రస్తుత కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అనూహ్య మార్పులకు గురవుతున్న నేపథ్యంలో కొనుగోలు ధరలు పరిస్థితులను గమనించి కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్లో ధరలు తగ్గిన ప్రతిసారీ దానిని పెట్టుబడికి ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశంగా మలచుకోవాలని నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ (ఫారెక్స్ & కమోడిటీస్) హెడ్ అభిలాష్ కోయిక్కర సూచిస్తున్నారు. దేశీయంగా భారత్ లో శుభాకార్యాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోలుకు ప్రస్తుత ధరలు అనువైనవని చెబుతున్నారు. పసిడి ధరలు మరికొన్ని రోజుల పాటు అస్థిరంగా కొనసాగుతాయని, తాత్కాలికంగా మరింత తగ్గుదల నమోదు చేయవచ్చంటున్నారు.