Fish Farming | కాసులు కురిపిస్తున్న చేపల చెరువు.. ఏడాదికి రూ. 36 లక్షలు సంపాదిస్తున్న మహిళా ఇంజినీర్..
Fish Farming | ఇంజినీర్లు( Engineers ) చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. కానీ మహిళా ఇంజినీర్( IT Engineer ) మాత్రం వినూత్నంగా చేపల పెంపకాన్ని( Fish Farming ) ఎంచుకున్నారు. మొదట్లో కొన్ని ఒడిదుడుకులు కలిగినప్పటికీ.. మెళకువలు నేర్చుకుని ఏడాదికి రూ. 36 లక్షలు సంపాదిస్తున్నారు. ఓ 12 మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు.
Fish Farming | ఆమె ఐటీ ఇంజినీర్( IT Engineer ). మల్టీ నేషనల్ కంపెనీల్లో జాబ్ చేశారు. డబ్బులు కూడా బాగానే సంపాదించారు. కానీ లాక్‌డౌన్ ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. కానీ ఆమె చివరకు చేపల పెంపకం( Fish Farming )పై దృష్టి సారించి.. చేపల చెరువులను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఏడాదికి 300 టన్నుల వరకు చేపలను విక్రయిస్తూ ఏడాదికి రూ. 36 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. మరి ఆ ఐటీ ఇంజినీర్ గురించి తెలుసుకోవాలంటే మధ్యప్రదేశ్( Madhya Pradesh ) వెళ్లక తప్పదు.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్( Jabalpur )కు చెందిన భవానీ ఝా( Bhavani Jha ) జబల్‌పూర్ ఇంజినీరింగ్ కాలేజీలో 2007లో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్( Hyderabad )కు వచ్చారు. హైదరాబాద్‌లోనే ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. మల్టీ నేషనల్ కంపెనీలోనూ ఓ రెండేళ్ల పాటు పని చేశారు. ఈ సమయంలోనే కౌస్తుభ్ అనే వ్యక్తితో భవానీకి పెళ్లి అయింది.

జాబ్ చేస్తున్నప్పటికీ వారికి సంతృప్తి లేదు..
ఇక ఇద్దరు జాబ్ చేస్తున్నప్పటికీ వారికి సంతృప్తి లేదు. ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సొంతూరు జబల్‌పూర్‌కు తిరిగొచ్చారు. స్థానికంగా ఓ కోచింగ్ సెంటర్‌ను కూడా నెలకొల్పాపూర్. విద్యార్థులకు ఐటీ రంగంలో శిక్షణ ఇస్తున్నారు.. ఎలాంటి ఇబ్బందేం లేదు. ఈలోపు ముగ్గురు పిల్లలను కూడా కన్నారు భవానీ.
చేపల పెంపకంపై దృష్టి
అంతలోనే కరోనా కూడా వచ్చేసింది. దీంతో కోచింగ్ సెంటర్‌ను మూసేశారు. భర్త ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీలో ఉద్యోగంలో చేరారు. కానీ భవాని జాబ్ వెతుక్కోలేదు. ఏదైనా బిజినెస్ చేయాలని నిర్ణయించుకుంది. అది కూడా ఆహార ఉత్పత్తులకు సంబంధించి. ఈ క్రమంలో పుట్టగొడుగుల సాగు, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి వాటిల్లో భవానీ శిక్షణ పొందారు. వీటన్నింటిలో ఆమె చేపల పెంపకాన్ని ఎంచుకున్నారు. భర్త తిరస్కరించాడు. అయినా కూడా భర్త మాట వినకుండా ముందడుగు వేసింది.
4.5 ఎకరాల భూమిలో చేపల చెరువు
తన నివాసానికి సమీపంలోని హింతోయా గ్రామపరిధిలో 4.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇది జబల్‌పూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే తొలిసారి చేపల పెంపకం కోసం చెరువు తవ్వినం. చేపల పిల్లలను కూడా ఆ చెరువులో వేసేశారు. కానీ చెరువులో రాళ్ల కారణంగా.. రెండు, మూడు రోజులకే నీరు ఇంకిపోయేది.
మత్స్య శాఖ సహాకారంతో

ఇక లాభం లేదనుకుని చెప్పి.. చేపల పెంపకంలో మెళకువులు తెలుసుకునేందుకు భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఫ్రెష్ వాటర్ అక్వాటిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ముంబైలోని సెంట్రల్ ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకున్నారు. దీంతో పాటు జబల్‌పూర్ మత్స్య శాఖ నుంచి ఆమెకు సహాకారం అందడంతో.. ఇక వెనక్కి తిరిగిచూడలేదు.
ఏడాదికి 20 నుంచి 30 టన్నుల వరకు చేపల ఉత్పత్తి
చేపల పెంపకంలో భాగంగా ఫిష్ షీడ్‌ను ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేశారు. ఆ తర్వాత వాటిని చేపల చెరువులో విడుదల చేయగా, తక్కువ వ్యవధిలోనే చేపలు పెరగడం ప్రారంభించాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆరు చేపల చెరువులను భవానీ నిర్వహిస్తున్నారు. ఏడాదికి 20 నుంచి 30 టన్నుల వరకు చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. ఒక్కో కేజీ చేపలను రూ. 120కి విక్రయిస్తున్నారు. అలా ఏడాదికి దాదాపు రూ. 36 లక్షల వరకు సంపాదిస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారు. ఈ చెరువులో పండించిన చేపలను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. త్వరలోనే మరిన్ని చేపల చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు.
12 మందికి జీవనోపాధి
మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ వదిలేసిన బాధ అసలే లేదని భవానీ పేర్కొన్నారు. తాము ఆదాయం ఆర్జించడంతో పాటు ఓ పన్నెండు మంది వరకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో చేపల వ్యాపారంలో మరింత రాణిస్తామని భవానీ చెప్పుకొచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram