మరింత పడిపోయిన బంగారం ధరలు

బుధవారం బంగారం ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,260 తగ్గి రూ.1,40,780 వద్ధ కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,150 తగ్గి రూ.1,29,050 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,45,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jul 01, 2026, 11:08 am IST
Read Time: 3 mins
మరింత పడిపోయిన బంగారం ధరలు

విధాత : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపధ్యంలో బంగారం, వెండి ధరలు వరుసగా పడిపోతున్నాయి. గతంలో ఎన్నడు లేని రీతిలో బంగారం ధరలు పడిపోవడం పెట్టబడిదారుల్లో ఆందోళన కల్గిస్తుంది. కొందరు మరింతగా ధరలు పడిపోతాయన్న ఆందోళనతో తమ పాత బంగారు ఆభరణాలను విక్రయిస్తున్నారు. బుధవారం బంగారం ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,260 తగ్గి రూ.1,40,780 వద్ధ కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,150 తగ్గి రూ.1,29,050 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,45,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.

అంతర్జాతీయంగా కామెక్స్ మార్కెట్‌లో స్పాట్ బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు ఒక్క రోజునే ఒక శాతానికి పైగా పడిపోయాయి. ఈ ఒక్క నెలలోనే బంగారం విలువ సుమారు 12.4 శాతం మేర క్షీణించడం గమనార్హం. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే వరుసగా నాలుగో నెల కూడా బంగారం నష్టాల నమోద తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో అక్టోబర్ 2008 తర్వాత బంగారం ధరలలో అత్యంత భారీ నెలవారీ పతనం నమోదైంది. ధరల తగ్గుదల ఇదే రీతిలో కొనసాగితే జూన్ 2013 త్రైమాసికం తర్వాత మార్కెట్ చూసే అతిపెద్ద త్రైమాసిక పతనం ఇదే అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారులకు ప్రస్తుత ధరలు సానుకూలంగా భావించవచ్చని చెబుతున్నారు.