అమరావతిని ఆపటం ఎవడి తరమూ కాదు : సీఎం చంద్రబాబు

రాష్ట్ర ప్రజలు వైసీపీ గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్ర రాజధానిపై ఆ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మావిగన్ ఎవరికైనా అర్ధం కాలేదని, మన రాజధాని అమరావతే.. అది దేవతల రాజధాని..కలియుగ దైవం వెంకటేశ్వరుడు అన్ని చూసుకుంటారని..అమరావతిని ఆపటం ఎవడి తరమూ కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Jul 02, 2026, 3:32 pm IST
Read Time: 6 mins
అమరావతిని ఆపటం ఎవడి తరమూ కాదు : సీఎం చంద్రబాబు

అమరావతి : రాష్ట్ర ప్రజలు వైసీపీ గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్ర రాజధానిపై ఆ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నాయకులు అమరావతి అన్నారని, గతంలో మూడుముక్కలాట (మూడు రాజధానులను ఉద్దేశించి) ఆడారని, ఎన్నికలు అయిపోయాక మావిగన్‌ అంటున్నారని విమర్శించారు. మావిగన్ ఎవరికైనా అర్ధం అయ్యిందా అని, మన రాజధాని అమరావతే.. అది దేవతల రాజధాని..కలియుగ దైవం వెంకటేశ్వరుడు అన్ని చూసుకుంటారని..అమరావతిని ఆపటం ఎవడి తరమూ కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ఈ పథకానికి కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా నిర్వహించి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టటంతో పాటు రైల్వే జోన్ సాధించాం అని, గూగుల్ డేటా సెంటర్ తోపాటు పుట్టపర్తిలో ఆమ్కా ఫైటర్ జెట్ తయారీ యూనిట్ వస్తోందని తెలిపారు. రాయలసీమను అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలుపుతాం. అని, సత్యవేడులో హీరో మోటార్స్ సైకిళ్ల తయారీ యూనిట్ ఉందని, తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్ వస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తున్నాం..

గొడ్డలి పార్టీ పాలనతో విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి రెండేళ్లలోనే మాట నిలుపుకున్నామని, 93 కేంద్ర పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేస్తే వాటిని మళ్లీ పునరుద్ధరించాం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జల్ జీవన్ మిషన్ సహా వివిధ పథకాలకు రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం, కేంద్రం అమరావతికి సహకారం అందించడంతో రాజధానిలో వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అన్నారు. ప్రజల మనిషి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారని, తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు, రహదారులు, పీఎంఏవై కోసం నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చామని మేము చెప్పటం లేదు. కానీ శుభారంభం చేశాం. ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం అన్నారు. ఈ వీబీజీ రామ్ జీ పథకం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.

స్వర్ణాంద్ర ప్రదేశ్ ఇక అన్ స్టాపబుల్

స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా ఏపీని తయారు చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. బంగారం గనులు దొరికిన జొన్నగిరి పేరును చారిత్రక పేరు స్వర్ణగిరిగా మార్చాం. దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రంగా రాయలసీమ ఉంది. త్వరలోనే ప్రభుత్వం రూ.40 వేలకోట్లతో, రూ.60 వేల కోట్లతో ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం అన్నారు. మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ కు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం.
నిస్వార్ధంగా పనిచేసే కూటమి నాయకత్వానికి సహకరించాలని ప్రజల్ని కోరుతున్నాననన్నారు. దేశం ముందు ఆ తర్వాత మనం. ఈ నినాదానికి అనుగుణంగా మనం అంతా సహకరించాలని, భారత మాతకు వికసిత్ భారత్.. తెలుగు తల్లికి స్వర్ణాంధ్ర సంకల్పం చేశాం అని, స్వర్ణాంద్ర ప్రదేశ్ ఇక అన్ స్టాపబుల్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.