ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయిని సహచర మహిళ ఫోక్ డ్యాన్సర్ మాధూరి రాథోడ్ తో ఒకే గదిలో కలిసి ఉన్న సమయంలో అతని భార్య శరణ్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం వైరల్ గా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్ లో ఉండగా వారిద్దరిని పట్టుకుంది. నీకు నా భర్తే దొరికాడా? అంటూ మాధురిపై ఈశ్వర్ భార్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకుంది. నా భర్తతో ఏడేళ్లుగా వైవాహిక బంధం మంచిగా కొనసాగుతున్న తరుణంలో మాధురి నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేసి నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఆరోపించింది. ఆమెకు అంతకుముందే మరొకరితో విడాకులు అయ్యాయని, ఆమెకు ఓ చిన్నారి కొడుకు కూడా ఉన్నాడని వెల్లడించింది.
తన భర్త మంచోడేనని..కనీసం మందు కూడా తాగడని, మాధురి వెంట పడి లొంగదీసుకుందని ఆవేదన వెళ్లగక్కింది. తన భర్త ప్రవర్తనపై, సదరు మహిళతో ఉన్న బంధంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె వేములవాడ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇలాంటి వారిని ఫోక్ ఇండస్ట్రీకి దూరం పెట్టాలని సూచించింది. అయితే పోలీసుల సమక్షంలో ఇరువర్గాలు రాజీకి వచ్చినట్లుగా సమాచారం.
ప్రముఖ జానపద గాయకుడు, ‘బాసింగా బలాలు’ ఫోక్ సాంగ్ హీరో ఈశ్వర్ సాయి మంచిపేరు సంపాదించారు. ఇందులో వైష్ణవి సోనీతో కలిసి నటించారు. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ గతంలోనూ పలు ఫోక్ సాంగ్స్‌లో కలిసి కనిపించారు. ‘రాతిరి రాతిరి రాతిరిలో’ పాటలో వీరిద్దరూ నటించారు. అలాగే ‘ప్రమీల’ వంటి ఫోక్ సాంగ్స్‌లోనూ ఈ జోడీ కలిసి కనిపించింది.
🚨 భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు.. వైరల్‌గా మారిన ఘటన
ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఓ వివాదంలో చిక్కుకున్నట్లు సమాచారం. నిన్న అర్థరాత్రి సమయంలో వీరిద్దరిని ఈశ్వర్ సాయి భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల విడుదలైన… pic.twitter.com/IW2iH9U7tr
— Suresh_Journalist (@Suresh_Journo) August 19, 2026