• Telugu News
  • /Telangana

రూపారెడ్డి మర్డర్ కేసులో సంచలన విషయాలు!

దేవరకొండ నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. -రూపారెడ్డి హత్య కేసులో.. నాగార్జున స్కూల్ 10వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులే నిందితులుగా తేలడం సంచలనం రేపింది

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 19, 2026, 1:22 pm IST
Read Time: 4 mins
రూపారెడ్డి మర్డర్ కేసులో సంచలన విషయాలు!

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న రూపారెడ్డి (45) దారుణ హత్య కేసులో మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. రూపారెడ్డి హత్య కేసులో.. నాగార్జున స్కూల్ 10వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులే నిందితులుగా తేలడం సంచలనం రేపింది. 11వ తేదీన స్కూల్ నుంచి రూపారెడ్డి ఇంటికి వెళ్లి..టీ పెట్టుకునే క్రమంలో ఇంటి వెనుక డోర్ తీసింది. అప్పటికే ఆ డోర్ వద్ద పొంచి ఉన్న విద్యార్థి విశ్వక్ ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా 25సార్లు పొడిచి చంపాడు.

ఈనెల 11న రాత్రి భర్త హైదరాబాద్ వెళ్లిన సమయంలో రూపారెడ్డి తన ఇంట్లో దారుణ హ‌త్య‌కు గురైంది. హత్యకు గల కారణాలు..విద్యార్థులే నిందితులుగా తేలడం అందరిని నివ్వేరపరిచింది. 20రోజుల క్రితం స్కూల్ హాస్టల్ కు నిందితుడు ఫోన్ తీసుకరావడంపై ప్రిన్సిపాల్ రూపారెడ్డి మందలించి టీసీ ఇచ్చి పంపించింది. పేరెంట్స్ అభ్యర్థనతో తిరిగి చేర్చుకోవడంతో ఆ విద్యార్థి రూపారెడ్డిపై కక్ష్య పెంచుకున్నాడు. ఆ తర్వాత నిందితుడు తోటి విద్యార్ధులతో గంజాయి సేవిస్తుండగా అతని వీడియో తీయడంతో రూపారెడ్డిపై మరింత ఆగ్రహంతో రగిలిపోయాడు. అలాగే ఆమె వద్ద ఉండే డబ్బులను దొంగిలించి…ఫోన్ కొట్టేయాలన్న లక్ష్యంతో రూపారెడ్డిపై నిందితుడు దాడి చేసి చంపేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడు రూపారెడ్డిని హత్య చేసిన అనంతరం నిందితుడు రూ.4లక్షల నగదును, ఆమె సెల్ ఫోన్ తో పరారయ్యాడు. రూపారెడ్డి హత్య కేసులో భర్తతో సహా పలువురిని విచారించిన పోలీసులు చివరకు ఆమె స్కూల్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడ్డారని తేల్చడం అశ్చర్యానికి గురి చేసింది. హత్యకు రెండు రోజుల ముందు.. ఆ తరువాత నిందితులైన విద్యార్ధులు స్కూల్ కు రాకపోవడంతో వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో మిస్టరీ వీడిపోయింది.