మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని , సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

సనత్‌నగర్ టిమ్స్(TIMS) ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు టి.హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Aug 19, 2026, 10:40 am IST
Read Time: 3 mins
మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని , సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

విధాత, హైదరాబాద్: ​సనత్‌నగర్ టిమ్స్(TIMS) ఆసుపత్రి సందర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు టి.హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ , సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. టిమ్స్ సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు కోకాపేటలోని అతని ఇంటివద్ద హౌస్‌ అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విషయం తెలుసుకుని హరీశ్‌రావు ఇంటికి చేరుకొన్నారు.

నిర్బంధాలు, హౌస్‌ అరెస్ట్‌లను హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిగా 1000పడకలతో టిమ్స్ నిర్మాణం తలపెట్టారని, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దానిని ఓపి సేవలకే పరిమితం చేయడం దారుణం అన్నారు. దీనిపై ప్రశ్నిస్తే హౌస్‌ అరెస్ట్‌లు చేయడం దారుణమన్నారు. ఆస్పత్రుల్లోని డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే తమను నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.