మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడుతూ పార్టీని స్థాపిస్తున్నానని వెల్లడించారు.
ప్రజల కోసం, ప్రజల గొంతుకను, ప్రజల సమస్యలను అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్‌లో బలంగా వినిపించడమే ప్రధాన లక్ష్యంతో ఒక లాయర్‌గా, ఓ ప్రతినిధిగా పనిచేయడానికే కొత్త పార్టీ పెడుతున్నాని తెలిపారు. తమ తదుపరి రాజకీయ ప్రణాళికలు, కార్యాచరణను ఈ నెలలోనే పూర్తిస్థాయిలో విజయవాడ వేదికగా మీడియాకు వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.
పార్టీతో పాటు మీడియా సంస్థలు కూడా..!
వైసీపీ కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి గతేడాది ఆ పార్టీకి, రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. అనంతరం రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ప్రకటించి వ్యవసాయానికి పరిమితమయ్యారు. తాజాగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించిన విజయసాయిరెడ్డి..ఇప్పటికే ఓ టీవీ ఛానెల్, పేపర్ ను సైతం ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. విజయసాయిరెడ్డి ప్రకటనల నేపథ్యంలో ఆయన ఓ రాజకీయ పార్టీకి అవసరమైన అన్ని సమీకరణలు, సాధనాలతో కొత్త పార్టీని ప్రజల ముందుకు తీసుకరాబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఏపీలో కొత్త పార్టీకి ప్లేస్ ఉందా.. ?
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీకి అనువైన వాతవారణం..ప్లేస్ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏపీ రాజకీయాల్లో… ఇప్పటికే ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో ప్రధానంగా దేనితో తలపడనుందన్నది ఆసక్తికరం కానుంది. తన సన్నిహిత బంధువైన జగన్ నేతృత్వంలోని వైసీపీ, ఆయన సోదరి షర్మిల సారధ్యంలోని కాంగ్రెస్ లతో విజయసాయి రెడ్డి పార్టీ తలపడాల్సి రానుండటం ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పేరు ‘ భారత్ జన వికాస్ ‘ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలాఖరులోగా ఆయన పెట్టబోయే పార్టీ పేరు ఏమిటి అనే అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన పార్టీకి ప్రజాదరణ ఉంటుందా..? మాజీ ఎంపీని ఎమ్మెల్యేగానే గెలిపించని ప్రజలు ఏకంగా రాజ్యాధికారం అందిస్తారా అన్న చర్చ కొనసాగుతుంది.
విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీకి సన్నాహాలు
🔹 మాజీ వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
🔹 ‘‘ప్రజల కోసం ప్రజల చేత’’ అనే నినాదంతో పార్టీని ప్రారంభిస్తామని, ఈ నెల నుంచే ప్రాథమిక సన్నాహాలు మొదలవుతాయని… https://t.co/TE2l5bOwLc pic.twitter.com/VcjaYhuoaB
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) August 19, 2026