Ahaetulla laudankia | ఇది ‘క‌ర్ర’ కాదండోయ్.. ప‌క్షుల‌ను వేటాడే విష‌పూరిత ‘పాము’

Ahaetulla laudankia | ఇది క‌ర్రె అనుకుంటే పొర‌పాటే.. ఎందుకంటే అది క‌ర్ర మాదిరి ఉంటుంది కానీ.. క‌ర్ర కాదు. క‌ర్రెను పోలి ఉండే అతి స్వ‌ల్ప విష‌పూరిత పాము( Snake ) ఇది. అహేతులా లాడంకియా( Ahaetulla laudankia ) అనే శాస్త్రీయ నామం గ‌ల పాము.. మారేడుమిల్లి అట‌వీ( Maredumilli Forest ) ప్రాంతంలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

Reported by: raj | తెలంగాణ‌ | Mar 20, 2026, 8:06 am IST
Read Time: 3 mins
Ahaetulla laudankia | ఇది ‘క‌ర్ర’ కాదండోయ్.. ప‌క్షుల‌ను వేటాడే విష‌పూరిత ‘పాము’

Ahaetulla laudankia | వ్య‌వ‌సాయ పొలాల వ‌ద్ద‌.. అట‌వీ ప్రాంతాల్లో స‌రీసృపాలు సంచ‌రిస్తుంటాయి. ఈ స‌రీసృపాల్లో పాములు( Snakes ) చెట్లు, గ‌డ్డి పొదల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటాయి. కొన్నిసార్లు చెట్ల కొమ్మ‌ల‌పై ఉంటూ.. స‌రిగా ఏర్ప‌డ‌వు. నిశితంగా ప‌రిశీలిస్తే కాని అది పాము అని గుర్తించ‌లేం. అలాంటి పాములు ఈ భూమ్మీద అధికంగానే ఉన్నాయి.

అయితే ఓ పామును క‌ర్ర‌ను పోలి ఉంది. కానీ అది క‌ర్ర కానే కాదు. క‌ట్టెను పోలిన ఓ అరుదైన స‌ర్పం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌( Andhra Pradesh )లోని పోల‌వ‌రం జిల్లా మారేడుమిల్లి( Maredumilli Forest ) మండ‌లంలో ప్ర‌త్య‌క్ష‌మైంది. జంగిల్ స్టార్ నేచ‌ర్ క్యాంపు( Jungle Star Nature Camp )లో ప‌ర్యాట‌కుల‌కు ఆ పాము క‌నిపించింది. అయితే చెట్ల మ‌ధ్య‌ల్లో, ఎండిన గ‌డ్డి మ‌ధ్య‌లో ఉన్న ఆ పామును చూసి.. క‌ర్ర అని ప‌ర్యాట‌కులు భావించారు. కానీ ద‌గ్గ‌రికి వెళ్లి చూడగా అది పాము. దాంతో భ‌య‌ప‌డిపోయారు.

సన్నగా తీగలా ఉండే ఈ పాము శాస్త్రీయనామం అహేతులా లాడంకియా( Ahaetulla laudankia ) అని ‘జంగిల్‌స్టార్‌ నేచర్‌క్యాంపు’ సమన్వయకర్త ఆమర్తి వీరబాబు తెలిపారు. ఇది ఆకుల్లో సులువుగా కలిసిపోతుందని, తల పొడవుగా, మెడ కంటే వెడల్పుగా ఉంటుందని తెలిపారు. పగటి పూట ఎక్కువగా చెట్లపై ఉంటూ, రాత్రి సమయాల్లో బల్లులు, కప్పలు, పక్షులను వేటాడుతుందన్నారు. దీనికి నోటిలో వెనుకవైపు కోరలు ఉంటాయని, విషం స్వల్పంగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు.