విధాత : అస్ట్రేలియా సిడ్నీ, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ సిటీలలో న్యూ ఇయర్-2026కు స్వాగతం సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు ఆరంభించారు. అందరికంటే ముందుగా న్యూజిలాండ్ దేశం 2026 కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో అర్థరాత్రి 12 గంటలు కాగానే..నగరం మొత్తం బాణాసంచా వెలుగులతో నిండిపోయింది. ప్రసిద్ధ స్కై టవర్ వద్ద జరిగిన బాణసంచా వేడుకలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
భౌగోళికంగా అంతర్జాతీయ దినరేఖకు దగ్గరగా ఉండటం వల్ల, ప్రపంచంలో కొత్త రోజును లేదా కొత్త ఏడాదిని ఆహ్వానించే మొదటి ప్రధాన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటిగా నిలుస్తుంది. న్యూజిలాండ్ కంటే ముందుగా పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి , సమోవా వంటి చిన్న ద్వీప దేశాలు 2026లోకి అడుగుపెట్టాయి.
న్యూజిలాండ్ తర్వాత తదుపరి వేడుకలు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మొదలయ్యాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ వద్ద లక్షలాది మంది ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద బాణసంచా ప్రదర్శన వేడుకను వీక్షించేందుకు అక్కడికి చేరుకున్నారు. న్యూఇయర్ ఎంటర్ కాగానే పేల్చిన బాణసంచా వెలుగుల్లో కేరింతలు కొడుతూ న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Wolf Supermoon | జనవరి 1, 4 తేదీల మధ్య ‘ఊల్ఫ్ మూన్’! కొత్త ఏడాదికి చందమామ ‘నిండైన’ స్వాగతం!
Ibomma Ravi : ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
