Ibomma Ravi : ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి కీలక అంశాలు

ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. పైరసీ, బెట్టింగ్ యాడ్స్ ద్వారా కోట్ల రూపాయల అక్రమ ఆదాయం సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు.

iBomma Ravi

విధాత, హైదరాబాద్ : ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి 12 రోజుల కస్టడీ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. 2 రకాలుగా సినిమాలు కొనుగోలు చేసిన రవి.. కామ్‌ కాడ్‌ ప్రింట్‌కు ఒక ధర, HD ప్రింట్‌కు మరో ధర.. HD సినిమా ప్రింట్లకు 200 డాలర్లు చెల్లించినట్లుగా పేర్కొన్నారు. రవికి సంబంధించిన ఏడు ఖాతాలను విచారణలో పోలీసులు గుర్తించారు. వాటిలో రూ.13.40 కోట్ల నగదు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. విదేశీ కరెన్సీ రూపంలో లావాదేవీలు జరిపాడని రిపోర్టులో వెల్లడించారు.

ఈ మొత్తంలో దాదాపు రూ. 10 కోట్లు విలాసవంతంగా గడపడానికి ఖర్చు చేశాడని..హైఫై పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బస చేయడం ద్వారా లగ్జరీ లైఫ్ ఎంజాయి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రవి అకౌంట్‌లో మిగిలిన రూ. 3 కోట్ల నగదును పోలీసులు ఫ్రీజ్ చేశారు. .క ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు రూ. 90 లక్షల నగదు పంపినట్లు పోలీసులు అతడి ద్వారా తెలుసుకున్నారు. రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రైడ్ మార్క్ లైసెన్స్, బెట్టింగ్, పైరసీ ద్వారా వచ్చిన నగదుతో రవి జల్సాలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలోనే రవి ఆఫీస్ నడిపినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి :

Good Luck Grapes : గుడ్ లక్ గ్రేప్స్…ట్రెండింగ్ లో న్యూఇయర్ 12గ్రేప్స్ థియరీ
Gold, Silver Price| తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

Latest News