విధాత: చిన్నప్పుడే తల్లి నుంచి దూరమైన ఓ కోతిపిల్ల జీవన గాథతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ దేశంలోని ఇచికావా సిటీ జూలో ఒక సంవత్సరం వయసున్న జపనీస్ మకాక్ జాతికి చెందిన పంచి-కున్ కోతి పిల్ల చిన్నప్పుడే తల్లికి దూరమైంది. దీంతో ఆ కోతి పిల్ల జూ కీపర్ల చేతులతో పెంచబడింది. పంచి కున్ కోతి పిల్ల తన తల్లికి దూరమైనప్పటి నుంచి తోటి కోతి గుంపులో కలవడంలో విఫలమైంది.
ఇతర కోతులతో సహజీవనం చేయడంలో విఫలమవ్వడంతో దాని ఒంటరి తనం పోగొట్టేందుకు జూ కీపర్లు ఒక ఓరంగ్‌టాన్ ఆరేంజ్ కలర్ బొమ్మను ప్రత్యాయ్నయ సహచరుడిగా భావించుకునేలా దానికి అందించారు. ఆ కోతి పిల్ల ఆ బొమ్మతో అనుబంధాన్ని పెంచుకుని జూలోని కోతుల గుంపు నుంచి ఆ బొమ్మ కోతిని కాపాడుకుంటూ..దానినే తన తల్లిగా, మిత్రునిగా భావిస్తూ నిరంతరం విడిచిపెట్టకుండా ఉంటుంది.
ఆ బొమ్మ కోతితోనే ఆటలాడుకుంటూ..దానిని కౌగిలించుకుని, దానితోనే కలిసి నిద్రపోతు ఓదార్పు పొందుతుంది. జూకీపర్లు ఆ కోతి పిల్ల సాటి కోతుల గుంపులతో కలిసిపోయేలా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే మానవులు పెంచిన కోతి పంచి-కున్ హృదయ విదారక కథ వీడియోలను చూసిన నెటిజన్లు అయ్యో పాపం అనుకుంటూ ఆ కోతి పిల్ల పట్ల తమ సానుభూతిని వ్యక్తీకరిస్తున్నారు.
Isi timeline-ku dipenuhi foto dan video seekor monyet di Jepang yang ditelantarkan ibunya, terus dikasih boneka monyek buat jadi pengganti sosok ibu dia. Dibawa-bawanya lah itu boneka ke mana-mana.🥹😭
Kenalin guys, nama dedeknya adalah Punch.🐒
/ credit to the owner / pic.twitter.com/igOpIDfLY2
— Hansip (@han_dycam) February 15, 2026
