విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు(Gold, Silver Price) మార్పులకు లోనవుతున్నాయి. బంగారం ధరలు వరుసగా మూడు రోజు కూడా తగ్గుదలను(Gold Rate Fall) నమోదు చేశాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా(Silver prices stable) ఉన్నాయి. బుధవారం 24క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర రూ.320తగ్గి..రూ.135,880వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300తగ్గి..రూ.1,24,550వద్ద ఆగింది.
స్థిరంగా వెండి ధరలు!
వెండి ధరలు నిలకడగా కొనసాగాయి. మూడు రోజుల్లో 27వేలు తగ్గిపోయిన కిలో వెండి ధర బుధవారం రూ.2,58,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది. డిసెంబర్ 27వ తేదీన రూ.2,85,000గా ఉన్న వెండి ధర అనూహ్యంగా తగ్గి..ప్రస్తుతం రూ.2,58,000వద్ద కొనసాగుతుండటం విశేషం. మార్కెట్ నిపుణులు మాత్రం భవిష్యత్తులో వెండి ధరలు పెరుగవచ్చనే అంచనా వేస్తున్నారు.
