విధాత : ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసిన బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పతనమవుతున్నాయి.సోమవారం 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.9,050తగ్గి.. రూ.1,51,153వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.8,300 తగ్గి రూ. 1,38,900కు పడిపోయింది. జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధర రూ.1,78,850కి చేరిన తులం బంగారం ధర నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.27,320తగ్గిపోవడం గమనార్హం.
రూ.20వేలు పడిపోయిన కిలో వెండి ధర
సోమవారం కిలో వెండి ధర ఏకంగా రూ.20,000తగ్గి.. రూ.3,00000లక్షలకు పడిపోయింది. జనవరి 29న అత్యధికంగా కిలో వెండి ధర రూ.4,25,000నమోదు కాగా..నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.1,25,000 తగ్గడం మార్కెట్ వర్గాలను సైతం అశ్చర్య పరుస్తుంది. లాభాల స్వీకరణ, బలహీన గ్లోబల్ సంకేతాలు, సీఎంఈ మార్జిన్ పెంపు వంటి అంశాలు కలిసి సోమవారం బంగారం, వెండి ధరలను దిగజార్చాయి.
మరింత తగ్గుతాయా..మళ్లీ పెరుగుతాయా?
గత ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు పెరుగుదలతో కొనుగోలుదారులను వణికించాయి. అంతర్జాతీయంగా రాజకీయ ఉద్రిక్తతలు, ప్రధాన కరెన్సీలు డాలర్ల బలహీనత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలఅనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు భారీగా బంగారం, వెండిలపై పెట్టుబడులు పెట్టడం, చైనా వెండి మార్కెటింగ్ విధానాలు, ఎలక్ట్రానిక్స్ రంగంలో వెండికి పెరిగిన డిమాండ్ వెండి ధరల భారీ పెరుగుదలకు కారణమయ్యాయి. ఆయా కారణాలతో ఇటు బంగారం ధరలు కూడా అనూహ్యంగా పెరిపోయాయి.
అయితే శుక్రవారం నుంచి వెండి, బంగారం పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తదుపరి ఫెడరల్ రిజర్వ్ చైర్‌గా కెవిన్ వార్ష్‌ను నియమించే ఆలోచనలో ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలు, ద్రవ్యోల్బణం నియంత్రణపై ఆశలు, అమెరికన్ డాలర్ బలపడటంతో బులియన్ మార్కెట్ లో వెండి, బంగారం ధరల పతనానికి కారణమయ్యయి,
ధరల అస్థిరత స్వల్పకాలమే
వెండి, బంగారం ధరల హెచ్చు తగ్గుల పరిణామాలు స్వల్పకాలం కొనసాగవచ్చని ఎల్ కేపీ సెక్యూరిటీస్ కు చెందిన జతీన్ త్రివేది అభిప్రాయపడ్డారు. వెండి ధరలు మరింత భారీ హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని, అయితే దీర్ఘకాలిక అంచనాలు చూస్తే ధరలు మళ్లీ కొంత కాలానికి పెరుగవచ్చన్నారు అలాగే ఛాయిస్ వెల్త్ రీసెర్చ్ అధిపతి అక్షత్ గార్గ్ కూడా ధరల అస్థిరతపై ఆందోళన అవసరం లేదని, బంగారం, వెండి అనేవి దీర్ఘకాలిక పెట్టుబడుల రక్షణగా పనిచేసే సాధనాలు అని, తక్షణ ట్రేడింగ్ కోసం కాదని స్పష్టం చేశారు.
అందుకే కొనుగోలుదారులు ధరల స్థిరత్వం వచ్చే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. దీర్ఘకాలికంగా చూస్తే.. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల విధానాలు, ద్రవ్యోల్బణ భయాలు వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలకు మద్దతుగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
