విధాత, హైదరాబాద్ : ఫిబ్రవరి నెలలో వరుస తగ్గుదలను నమోదు చేస్తున్న బంగారం, వెండి ధరలు శనివారం మాత్రం అనూహ్యంగా మళ్లీ పెరిగి..కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,890 తగ్గి.. రూ.1,56,600వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,650తగ్గి . రూ. 1,43,550వద్ద నిలిచింది.
రూ. 5వేలు పెరిగిన కిలో వెండి ధర
భారీ తగ్గుదలతో పతనమైన వెండి ధరలు శనివారం కొంత మేరకు పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్ లో శనివారం కిలో వెండి ధర రూ.5,000పెరిగి రూ. 2,85,000కు చేరింది. అయితే జనవరి 29నాటి ఆల్ టైమ్ రికార్డు రూ.4,25,000కు చేరుకోవాలంటే మరికొంత కాలం పట్టవచ్చంటున్నారు నిపుణులు.
భారత్ లో ఫిబ్రవరి 18నుంచి శుభ కార్యాలు మొదలవుతుండటం, చైనాలో సైతం చంద్ర నూతన సంవత్సరం సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లు జోరందుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
