Gold, Silver Price Increase| మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

ఆల్ టైమ్ రికార్డు ధరలు నుంచి ఐదు రోజులుగా భారీ పతనానికి గురైన బంగారం, వెండి ధరలు బుధవారం నాటికి మళ్లీ పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.6,600పెరిగి, రూ.1,60,530కి చేరింది. కిలో వెండి ధర రూ. 20,000పెరిగి రూ.3,20,000లకు చేరింది.

విధాత, హైదరాబాద్ : ఆల్ టైమ్ రికార్డు ధరల  నుంచి ఐదు రోజులుగా భారీ పతనానికి గురైన బంగారం, వెండి ధరలు బుధవారం నాటికి మళ్లీ పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.6,600పెరిగి, రూ.1,60,530కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.6050పెరిగి రూ.1,47,150వద్ద నిలిచింది.

రూ.20వేలు పెరిగిన కిలో వెండి

ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,000నుంచి ఐదు రోజుల్లోనే రూ.3లక్షలకు పడిపోయిన కిలో వెండి ధర బుధవారం మళ్లీ పెరుగుదల బాట పట్టింది. బులియన్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 20,000పెరిగి రూ.3,20,000లకు చేరింది.

ధరల పతనం తాత్కాలికమే

బంగారం, వెండి ధరల భారీ పతనం కేవలం తాత్కాలికమేనని, ధీర్ఘకాలికంగా వాటి డిమాండ్ లో మార్పు ఉండదని, రానున్న కాలంలో ధరలు పుంజుకుంటాయని మార్కెట్ నిపుణులు జేపీ మోర్గాన్ అభిప్రాయపడ్డారు. వారం రోజుల్లోనే వెండి, బంగారం ధరలు 13శాతం పడిపోయాయని, మరికొన్ని రోజులు ధరల హెచ్చుతగ్గులు కొనసాగిన భవిష్యత్తులో పెరుగుదల కొనసాగిస్తాయని పేర్కొన్నారు. బంగారం, వెండి ఎప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతున్నందునా వాటి ధరల స్థిరీకరణ తధ్యం అన్నారు.

మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. దీర్ఘ కాలంలో బంగారం, వెండి మంచి లాభాలను అందిస్తాయని తెలిపారు.  అయితే సమీప కాలంలో ధరలు ఇంకాస్త హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ధరలు తగ్గినప్పుడల్లా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడం సరైన వ్యూహంగా చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్ సంకేతాలు, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ పై దృష్టి సారించి బంగారం, వెండిపై పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిదని తెలిపారు.

Latest News