iBomma Ravi : ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ

కొత్త సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం నుంచి విచారణ కొనసాగించనున్నారు.

Ibomma Ravi

విధాత, హైదరాబాద్ : కొత్త సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కొత్తగా నమోదైన నాలుగు కేసుల్లో ఒక కేసులో కస్టడీకి నిరాకరించిన కోర్డు..మరో మూడు కేసుల్లో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. పోలీసుల వాదనలను ఏకీభవించిన కోర్టు కస్టడీకి అంగీకరించింది.

శనివారం, సోమవారం, మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులు రవిని కస్టడీ విచారణ చేయనున్నారు. రవి బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సోమవారం వాదనలు విననుంది. కొత్త సినిమాలను రవి పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్ లలో పెట్టడం ద్వారా నిర్మాతలు భారీ నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. అంతేగాక వెబ్ సైట్ లలోకి వెళితే గేమింగ్ యాప్ లకు కనెక్ట్ అయ్యేలా చేసి రవి సైబర్ నేరాలకు పాల్పడ్డాడని కూడా కేసులు నమోదయ్యాయి. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‎పల్లిలో అరెస్టు చేసి షాక్ ఇచ్చారు.

పైరసీ కేసులో పట్టుబడి రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఇప్పటికే రవిని కోర్టు అనుమతితో రెండు సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం ఎనిమిది రోజులపాటు విచారించారు. ఐబొమ్మ రవిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. రవి నుంచి రాబట్టాల్సిన విషయాలు, సేకరించాల్సిన ఆధారాలు ఇంకా ఉన్నాయని మరోసారి రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించడంతో మరో మూడు రోజులపాటు కస్టడీకి కోర్టు అనుమతించింది.

ఇవి కూడా చదవండి :

Narsampet : నర్సంపేటలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్
22a List Controversy | తెలంగాణ రైతులకు సర్కార్‌ షాక్‌! కోటి ఎకరాల భూములపై లావాదేవీలు బంద్‌!

Latest News