Malavya Raja Yoga | గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పు ఆయా రాశుల్లో అనేక మార్పులను తీసుకువస్తాయి. ఈ మార్పులు ప్రతికూలంగా, అనుకూలంగా ఉంటాయి. అయితే సంపద, శ్రేయస్సుకు కారణమైన శుక్రగ్రహం మార్చి( March ) 15వ తేదీన కుంభ రాశి( Aquarius ) లోకి ప్రవేశించనుంది. దీంతో మాలవ్య రాజయోగం( Malavya Raja Yoga ) ఏర్పడుంది. ఎంతో శక్తివంతమైన ఈ రాజయోగం వల్ల ఈ నాలుగు రాశుల వారికి సమాజంలో గౌరవం లభించడంతో పాటు అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వీటితో పాటు ఉద్యోగులకు పదోన్నతులు కూడా లభించనున్నాయి. మరి ఆ నాలుగు రాశులేంటో చూసేద్దాం.
వృషభరాశి (Taurus)
మాలవ్య రాజయోగం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనేక ఆర్థిక ప్రయోజనాలు లభించనున్నాయి. ఆకస్మిక ప్రయాణాల వల్ల కూడా ధనలాభం పొందనున్నారు. విద్యార్థుల్లో చదువుల్లో రాణించి ర్యాంకులు కైవసం చేసుకోనున్నారు. కుటుంబ అంతా కూడా సుఖసంతోషాలతో గడపనున్నారు.
మిథున రాశి (Gemini)
మిథున రాశి వారిలో కూడా అనేక మార్పులు సంభవించనున్నాయి. ఆత్మ విశ్వాసం పెరగడంతో పాటు కష్టానికి తగిన ఫలితం పొందనున్నారు. సమాజంలో ఎన్నాళ్ల నుంచో గుర్తింపు కోసం వేచి చూస్తున్న వారికి గుర్తింపు లభించనుంది. అవార్డులు, రివార్డులు పొందనున్నారు. ఊహించని విధంగా ఆదాయం సమకూరుతుంది. సామాజిక హోదా విపరీతంగా పెరుగుతుంది.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారు మాలవ్య రాజయోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు. ఊహించని విధంగా ఈ సమయంలో వీరి జీవితం మలుపు తిరుగుతుంది. ఇల్లు కొనుగోలు చేయాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. కార్యాలయాల్లో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ధనస్సు రాశి (Sagittarius)
ధనస్సు రాశి వారికి మాలవ్య రాజయోగం వలన సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకోని విధంగా ఆదాయం చేతికందుతుంది. దాంతో ఆర్థికంగా ఉన్నతస్థానానికి ఎదుగుతారు. గొప్ప గొప్ప అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగం చేసే చోట ప్రశంసలు అందుకుంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొందరికి ఈ రాజయోగం వలన ప్రమోషన్స్ కూడ వచ్చే ఛాన్స్ ఉంది.
