మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. దూరప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వారం ఆరంభంలో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండడం వల్ల సమస్యలు క్రమంగా తొలగి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. ఆదాయంలో స్థిరమైన వృద్ధి కారణంగా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యత నెలకొంటుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తారు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఈ వారం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వ్యాపారులు ఈ వారం కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఉద్యోగులు తమ కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి నడుచుకోవాలి. వృత్తిపరమైన బాధ్యతలపై ఏకాగ్రత పెంచాలి. ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం అధికంగా ధనవ్యయం ఉంటుంది. వృథా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ప్రేమ జీవితంలో అపార్థాలు తొలగుతాయి. మూడో వ్యక్తి జోక్యం కారణంగా వైవాహిక సంబంధాల్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల పరంగా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికి అంతిమంగా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ లక్ష్య సాధనలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో పురోగతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఆదాయంలో గణనీయమైన పెరుగుదలతో ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. దుబారా ఖర్చులు చేయకుండా పొదుపు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా కొనసాగుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా, ఆర్థికంగా శ్రేష్ఠమైన ఫలితాలు అందుకుంటారు. చిన్న చిన్న ఆటంకాలు తప్ప వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. పనిప్రదేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి, అధికారుల ప్రశంసలు ప్రోత్సాహాన్నిస్తాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు ఆనందం కలిగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. డబ్బును తెలివిగా ఖర్చు చేయడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఆనందదాయకంగా సాగుతాయి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు అవలంబించే నూతన ప్రణాళికలు భారీ లాభాలు అందిస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమృద్ధిగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ యోగాలున్నాయి. విదేశీయానానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీతం గణనీయంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల కోసం అధిక వ్యయం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాలు బంధంగా మారుతాయి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం ముందుచూపుతో నడుచుకుంటే మంచిది. వ్యాపారులు వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార నిమిత్తం సుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాలు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తాయి. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులకు, బదిలీలకు అవకాశం ఉంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు రాకుండా మాటలు అదుపులో ఉంచుకోండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో వృద్ధి, గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విజయావకాశాలు పెరుగుతాయి. వ్యాపారులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వ్యూహాత్మక నిర్ణయాలతో మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ఉన్న ఆటంకాలు తొలగుతాయి. విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభయోగాలున్నాయి. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. పదవీయోగం కూడా ఉంది. అధికారుల ప్రశంసలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆర్థికంగా అద్భుతమైన సమయం నడుస్తోంది. ఆదాయంలో గణనీయమైన పెరుగుదలతో ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. గ్రహ సంచారం అద్భుతంగా ఉన్నందున ప్రారంభించిన ప్రతి పనిలోనూ విజయం వెన్నంటే ఉంటుంది. ఉద్యోగంలో పనిపట్ల మీరు చూపే నిబద్ధత, శ్రద్ధ మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. వ్యాపారంలో వ్యూహాత్మక నిర్ణయాలతో లాభాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ప్రణాళిక బద్దంగా వ్యవహరించడం వల్ల ఆర్థికంగా బలోపేతం అవుతారు. ముందుచూపుతో ఖర్చులు అదుపులో ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సహనం అవసరం.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం తమ తమ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో మీ ప్రతిభను చాటుకోవడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. సమయానుకూల నిర్ణయాలతో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికంగా మేలైన సమయం. ఆదాయంలో వృద్ధి ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ప్రేమ వ్యవహారాల్లో నిజాయతీతో మెలగాలి. వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం మధ్యస్థంగా ఉండవచ్చు. ఉద్యోగంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అధికారుల మెప్పు కోసం గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగుతాయి. వివాహ జీవితంలో కొంత ఒత్తిడి, మానసిక ఆందోళన ఉండే అవకాశం ఉంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఉజ్వలమైన భవిష్యత్తు గోచరిస్తోంది. ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారంలో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఎంత కృషి చేస్తే అంత గొప్ప ఫలితాలు సాధించవచ్చు. ఆర్థికంగా, ఆదాయం స్థిరంగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరగకుండు చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు రాకుండా జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం శ్రమతో కూడిన ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పట్టుదల, ఏకాగ్రతతో లక్ష్యాలు సాధించి ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకుంటారు. మీ సమర్ధతను అందరూ గుర్తిస్తారు. వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగుతాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో వివాదాలు రాకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు.