Heartbreaking Video | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వుతెప్పించేటివి కాగా, మరికొన్ని కంటతడి పెట్టించేటివి ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ తన భర్త అంత్యక్రియలకు స్ట్రెచర్‌పై వచ్చింది.
మహారాష్ట్ర (Maharastra)లోని సతారా (Satara) జిల్లా దారే గ్రామానికి చెందిన హవల్దార్ ప్రమోద్ పరశురామ్ జాదవ్ (32) ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం లడఖ్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి భార్య గర్భవతి. ప్రసవం ఉండటంతో సెలవు తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. తండ్రిని అవుతున్నానన్న సంతోషంతో బయల్దేరాడు. అయితే మార్గం మధ్యలో అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఈ ప్రమాదంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అదే సమయంలో అతని భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భర్త మరణించిన విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరైంది. బిడ్డని చూడకుండానే వెళ్లిపోయాడంటూ రోదించింది. డెలివరీ అయిన 8 గంటలకే జాదవ్ భార్య తన నవజాత శిశువుతోపాటూ శ్మశానవాటికకు బయల్దేరింది. స్ట్రెచర్‌పై వచ్చి భర్తకు కడసారి వీడ్కోలు పలికింది. ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న వారితో కంటతడి పెట్టించింది. జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఇలా విషాదంగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
*👆 కేవలం 8 గంటల క్రితం జన్మించిన తమ నవజాత కుమార్తెతో కలిసి, ఒక వీరవనిత స్ట్రెచర్‌పై ఉన్న తన ధైర్యశాలి భర్తకు (విధి నిర్వహణలో అమరుడైన) చివరి వీడ్కోలు పలుకుతున్న హృదయవిదారక వీడియో ఇది.*
*సరిహద్దుల్లో శాంతి కోసం చెల్లించే మూల్యం మరియు దానిని చెల్లించే విధానం… భారత సైన్యం యొక్క… pic.twitter.com/6c3Xi00cKJ
— Johny Kaki (@johny_kaki) February 15, 2026
ఇవి కూడా చదవండి :
Crocodile Attack : మహిళను చంపేసిన మొసలి..వీడియో వైరల్
Vijay-Rashmika : 26న విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి
