7 Rupees Theft Case : రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
₹7 దొంగతనం కేసులో 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు! 1977 నాటి కేసును ముగిస్తూ ముంబై కోర్టు కీలక నిర్ణయం. నిందితులు, బాధితుడి ఆచూకీ లేకపోవడంతో కేసును మూసివేసిన న్యాయస్థానం.
ఆస్తి వివాదం, రూ.కోట్ల దొంగతనం (Theft), అత్యాచారం, హత్య వంటి హై ప్రొఫైల్ కేసుల్లో తీర్పు రావడానికి సమయం కాస్త ఎక్కువే పడుతుంది. అయితే, కేవలం రూ.7 దొంగతనం కేసుపై తుది తీర్పుకు ఏకంగా దశాబ్దాలు పట్టిందంటే మీరు నమ్ముతారా..? ఇది నిజం. సరిగ్గా 50 ఏండ్ల క్రితం జరిగిన ఓ దొంగతనం కేసుకు కోర్టు ఇప్పుడు ఎండ్ కార్డ్ వేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..? దక్షిణ ముంబైలోని మజగావ్ న్యాయస్థానం (Mumbai Court) పాత కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పాత కేసులు ఎక్కువై.. న్యాయ వ్యవస్థపై భారం పడుతోందని.. వాటికి ముగింపు పలికేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే 1977 నాటి రూ. 7.65 చోరీ కేసు ఇప్పటికీ పెండింగులోనే ఉన్న విషయం మజగావ్ కోర్టు దృష్టికి వచ్చింది. అప్పట్లో రూ.7 అంటే పెద్ద మొత్తమే. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. చోరీ సొమ్మును రికవరీ చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. అంతేకాదు ఫిర్యాదు దారుడి ఆచూకీ కూడా లభించలేదు. దీంతో ఈ కేసు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉంది.
నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కేసు 50 ఏండ్లుగా సాగుతూనే ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన న్యాయవాది.. ఈ కేసుకు తాజాగా ముగింపు పలికారు. దాదాపు యాభై ఏళ్లుగా కేసు పెండింగ్‌లో ఉన్నదని, ఎలాంటి పురోగతి లేదని, అలాంటప్పుడు దశాబ్దాలుగా ఈ కేసును కొనసాగించడంలో అర్థం లేదని మజగావ్ మెజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి అభిప్రాయపడ్డారు. దీన్ని మూసివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటించారు. చోరీ మొత్తం రూ.7.65ను ఫిర్యాదుదారుకు అప్పగించాలని సూచించారు. ఆయన ఆచూకీ లేకపోతే.. ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. కాగా, ఇటీవలే హర్యానా హైకోర్టు కూడా ఇలాంటి ఓ కేసుకు ముగింపు పలికిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
Pongal Movies | సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే.. సీనియర్లకి గట్టి షాక్ ఇచ్చారుగా..!
Varun Tej | ‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కంబ్యాక్‌పై అంచనాలు.. గ్లింప్స్ అదిరిపోయింది అంతే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram