Heartbreaking Video | జ‌వాను మృతి.. డెలివ‌రీ అయిన 8 గంట‌ల‌కే స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి వీడ్కోలు ప‌లికిన భార్య‌.. కంట‌త‌డి పెట్టిస్తున్న వీడియో

మహారాష్ట్ర (Maharastra)లోని సతారా (Satara) జిల్లాలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికేందుకు ఓ భార్య‌త అప్పుడేపుట్టిన బిడ్డ‌ను తీసుకుని స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చింది.

Heartbreaking Video | జ‌వాను మృతి.. డెలివ‌రీ అయిన 8 గంట‌ల‌కే స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి వీడ్కోలు ప‌లికిన భార్య‌.. కంట‌త‌డి పెట్టిస్తున్న వీడియో

Heartbreaking Video | సోష‌ల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. అందులో కొన్ని న‌వ్వుతెప్పించేటివి కాగా, మ‌రికొన్ని కంట‌త‌డి పెట్టించేటివి ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మ‌హిళ త‌న భ‌ర్త అంత్య‌క్రియ‌ల‌కు స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చింది.

మహారాష్ట్ర (Maharastra)లోని సతారా (Satara) జిల్లా దారే గ్రామానికి చెందిన హవల్దార్ ప్రమోద్ పరశురామ్ జాదవ్ (32) ఇండియ‌న్ ఆర్మీలో ప‌నిచేస్తున్నాడు. ప్ర‌స్తుతం లడఖ్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. అత‌డి భార్య గ‌ర్భ‌వ‌తి. ప్ర‌స‌వం ఉండ‌టంతో సెల‌వు తీసుకుని స్వ‌గ్రామానికి బ‌య‌ల్దేరాడు. తండ్రిని అవుతున్నాన‌న్న సంతోషంతో బ‌య‌ల్దేరాడు. అయితే మార్గం మ‌ధ్య‌లో అత‌డు రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యాడు.

ఈ ప్ర‌మాదంలో అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. అదే స‌మ‌యంలో అత‌ని భార్య పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. భ‌ర్త మ‌ర‌ణించిన విష‌యం తెలుసుకుని క‌న్నీరుమున్నీరైంది. బిడ్డ‌ని చూడ‌కుండానే వెళ్లిపోయాడంటూ రోదించింది. డెలివ‌రీ అయిన 8 గంట‌ల‌కే జాద‌వ్ భార్య త‌న న‌వ‌జాత శిశువుతోపాటూ శ్మ‌శాన‌వాటిక‌కు బ‌య‌ల్దేరింది. స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి భ‌ర్త‌కు క‌డ‌సారి వీడ్కోలు ప‌లికింది. ఈ హృద‌య విదార‌క దృశ్యం అక్క‌డున్న వారితో కంట‌త‌డి పెట్టించింది. జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు ఇలా విషాదంగా మారడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. గ‌త నెల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Crocodile Attack : మహిళను చంపేసిన మొసలి..వీడియో వైరల్
Vijay-Rashmika : 26న విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక పెళ్లి