Crocodile Attack : మహిళను చంపేసిన మొసలి..వీడియో వైరల్

ఇండోనేషియాలో మొసలి దాడిలో మహిళ మృతి. అసెహ్‌లో నది వద్ద జరిగిన ఘటన వీడియో వైరల్. గ్రామస్తుల కళ్లముందే ఘోరం.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Feb 16, 2026, 4:12 pm IST
Read Time: 3 mins
Crocodile Attack : మహిళను చంపేసిన మొసలి..వీడియో వైరల్

విధాత : భారీ మొసళ్లు, పైథాన్లకు అస్ట్రేలియాతో పాటు ఇండోనేషియా, సుమ్రతా దీవులలోని నదులు అవాసంగా మారాయి. అయితే తరచూ ఇండోనేషియాలో పైథాన్లు, మొసళ్ల దాడులకు మనుషులు బలవుతున్న ఘటనలు ఆందోళకరంగా మారాయి. తాజాగా అసెహ్‌లోని దేసా బులు హడిక్‌ ప్రాంతంలో ఓ మహిళ ను భారీ మొసలి దాడి చేసి చంపేసిన ఘటన కలకలం రేపింది.

మహిళపై మొసలి దాడి సమాచారం తెలుసుకున్న స్థానికులు నది ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆ భారీ మొసలి సైతం గ్రామస్తులపైకి దూసుకవచ్చింది. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండగా.. బురద నీటిలో నుంచి మహిళ మృతదేహాన్ని బయటకు తీస్తున్న క్రమంలో మరోసారి మొసలి కనిపించడంతో అటవీ సిబ్బంది ఆ మొసలిపై మత్తు తుటాలను ప్రయోగించి దానిని బంధించే ప్రయత్నం చేశారు. మహిళ మృతదేహాన్ని బయటకు తీసి మ్యానిటర్ గా మారిన మొసలిని బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

బయోలాజికల్ కన్జర్వేషన్ జర్నల్ డేటా ప్రకారం ప్రపంచంలో 2010-2019 నుండి మొసళ్ల దాడుల ఘటనలలో 665 సంఘటనలలో అత్యధికంగా 47శాతం ఇండోనేషియా లోనే నమోదు కావడం గమనార్హం. తరచుగా సుమత్రా దీవుల ప్రాంతాలలో అటవీ నిర్మూలన, మైనింగ్ లతో వన్యప్రాణులు జనాలపై దాడులకు పాల్పడుతున్నాయని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Trisha Krishnan : తమిళనాడు బీజేపీ చీఫ్ వ్యాఖ్యలపై నటి త్రిష ఫైర్ !
Vijay-Rashmika : 26న విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక పెళ్లి