విధాత : మనుషులకు సాధారణంగా ఒక పాము ఎదురుపడితేనే భయంతో వణికిపోతుంటారు.అలాంటిది ఒకేసారి 40పాముల గుంపు ఎదురుపడితే చూసిన వారికి పై ప్రాణాలు పైనే పోతాయానడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి పరిస్థితి మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోచోటుచేసుకుంది. ఓ ఇంట్లో వాళ్లకు అలాంటి పాముల గుంపు కనిపించడంతో వారి పరిస్థితి ఏమిటో ఆలోచిస్తేనే వణుకు పుట్టక తప్పదు.
రామ్‌టెక్ సమీపంలోని నేర్లా గ్రామంలో రాజు ధోమానే అనే వ్యక్తి ఇంట్లో ఒకటి రెండు కాదు.. ఏకంగా 40నాగుపాము పిల్లలు, రెండు పెద్ద విషపూరిత పాములు బయటపడటంతో కుటుంబ సభ్యులు భయంంతో కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశారు. వాటిని చూసిన గ్రామస్థులు కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఎంతో జాగ్రత్తగా స్నేక్ క్యాచర్ రతన్ కుంభారే సహాయంతో ఒక్కో నాగుపాము పిల్లను పట్టుకుని మొత్తం 40 పాములను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో వాటిని అడవిలో వదిలిపెట్టారు. అయితే ఒకే ఇంట్లో ఇంత పెద్ద సంఖ్యలో నాగుపాము పిల్లలు ఎలా వచ్చాయి? వాటి తల్లి పాము ఇంకా అక్కడే ఉందా? అనే ప్రశ్నలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది.
ఇళ్ల పరిసరాల్లో పాములు కనిపిస్తే భయపడకూడదని, వాటిని చంపడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నించకూడదని, బదులుగా అనుభవజ్ఞులైన పాముల సంరక్షకులను లేదా అటవీ శాఖ అధికారులను వెంటనే సంప్రదించాలని అధికారులు సూచించారు.
Nagpur | एक-दोन नाही… तब्बल ४० नागांची पिल्ले; दोन विषारी नागही जेरबंद
नागपूर जिल्ह्यातील रामटेक जवळच्या नेरला गावात राजू ढोमने यांच्या घरामध्ये तब्बल ४० नागांची पिल्ले आणि दोन मोठे विषारी नाग आढळून आल्याने परिसरात काही काळ भीतीचे वातावरण निर्माण झाले होते.
घटनेची माहिती मिळताच… pic.twitter.com/EHylILnmqZ— Jai Maharashtra News (@JaiMaharashtraN) July 5, 2026